ఎన్టీఆర్ నుంచి నాగచైతన్య వరకు 2 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోలు.. పవన్, నరేష్ టాప్..!
సినిమా ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు కామన్ అయిపోయాయి.. చాలామంది స్టార్లు రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఈ లిస్టులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. దివంగత నట సౌర్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ నుంచి తాజాగా అక్కినేని నాగచైతన్య వరకు రెండు అంతకుమించి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు ఎవరో చూద్దాం.
సీనియర్ ఎన్టీఆర్ :
ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాలు గెలిచిన నందమూరి తారక రామారావు రెండు పెళ్లిల్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య బసవతారకం క్యాన్సర్ తో మృతి చెందాక 70 ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకున్నారు.
హరికృష్ణ :
నందమూరి వారసుడు చైతన్య రథసారధి హరికృష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్యకు కలిగిన సంతానమే కళ్యాణ్ రామ్ - జానకి రామ్ - సుహాసిని. ఇక హరికృష్ణ మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు శాలిని. వీరి సంతానమే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. నాగార్జున :
ముందు హీరో వెంకటేష్ చెల్లి లక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జున చైతన్య పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చి హీరోయిన్ అమలను పెళ్లాడాడు. ఈ దంపతులకు అఖిల్ పుట్టాడు.
నాగచైతన్య :
నాగ్ బాటలోనే చైతన్య కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముందు సమంతను పెళ్లాడి విడాకులు ఇచ్చాక ఈ రోజు హీరోఇయన్ శోభితను పెళ్లాడాడు.
పవన్ కళ్యాణ్ :
ముందు నందినిని.. తర్వాత హీరోయిన్ రేణుదేశాయ్‌ను పెళ్లాడాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక రేణుకు కూడా విడాకులు ఇచ్చి అన్న లెజెనోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూడా ఇద్దరు పిల్లలు.
సూపర్‌స్టార్ కృష్ణ :
సూపర్ స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. తన మరదలు ఇందిరా దేవిని పెళ్లాడారు. వారి సంతానమే మహేష్ బాబు.. రమేష్ బాబు, మంజుల, పద్మావతి, ప్రియదర్శిని. ఆ తర్వాత తనతో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు. ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు.
నరేష్ :
నరేష్ విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రియల్ కి వచ్చాడు. హీరో నరేష్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం నరేష్ నాలుగో భార్యా ప్రముఖ నటి పవిత్ర లోకేష్ కున్నారు. అంతకుముందు ముగ్గురికి కూడా నరేష్ విడాకులు ఇచ్చాడు.
మోహన్ బాబు :
మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి చనిపోవడంతో ఆమె చెల్లి నిర్మలాదేవిని పెళ్ళాడారు.. రెండో భార్య సంతానం మంచు మనోజ్.. మొదటి భార్య సంతానం మంచు విష్ణు - మంచి లక్ష్మి.
మంచు మనోజ్ :
మోహన్ బాబు రెండో తనిఖీలు మనోజ్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మౌనికతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. మౌనిక కూడా అంతకుముందే పెళ్లయింది. కృష్ణంరాజు.. రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి భార్య చనిపోవడంతో శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు.