' పుష్ప 2 ' లో నటించిన వాళ్లు ఎందరు... ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే...!
పుష్ప 2 మరికొద్ది గంటలలో థియేటర్లలోకి రాబోతుంది. టాలీవుడ్ క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రు. 475 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రు. 1060 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఒక తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగటం ఇదే మొదటిసారి కావటం విశేషం. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు పుష్ప 2 థియేటర్ బిజినెస్ ఏకంగా రు. 675 కోట్లు చేసింది. 2021 లో విడుదలైన పుష్ప 1 సినిమా 350 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టిన విషయం తెలిసిందే. ఇక పుష్ప 2 డిసెంబర్ ఏదైనా ప్రపంచ వ్యాప్తంగా 12,500 ధియేటర్లలో విడుదల కాబోతుంది. ఆరు భాషలలో వస్తున్న ఈ సినిమా కోసం భారతదేశవ్యాప్తంగానే కాదు ... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినిమా ప్రేమికులందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా కోసం పనిచేసిన వారు ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు ? అన్నది సహజంగానే ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా కోసం పనిచేసిన అల్లు అర్జున్ కు ముందుగా రు. 275 కోట్లు పారితోషం ఇవ్వాలని అనుకున్న ఫైనల్ గా రు. 240 కోట్లు ఫిక్స్ చేశారు. ఇక రష్మిక మందన్న కు రు. 10 కోట్లు రెమ్యూనరేషన్ ముట్టింది. ఫాహాద్ ఫాజిల్ రు. 8 కోట్లు ఛార్జ్ చేశాడట. తొలిపార్ట్ కు 3.5 కోట్లు తీసుకున్న ఈ మలయాళం హీరో ఇప్పుడు డబుల్ తీసుకున్నాడు. ఇక నాలుగు రోజులపాటు స్పెషల్ ఐటెం సాంగ్ లో నటించిన శ్రీలలకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ ముట్టింది, ఇక డైరెక్టర్ సుకుమార్ అండ్ టీంకు మొత్తం కలిపి 140 కోట్ల రెమ్యూనరేషన్ ముట్టినట్టు తెలుస్తోంది, అయితే ఈ మొత్తం నుంచి బన్నీ వ్యవహారాలు చూసిన వ్యక్తికి 10 కోట్లు కమీషన గా వెళ్లినట్టు తెలుస్తోంది.