ఒకే రోజు 55 వేల షోలు.. రిలీజ్కు ముందే పుష్ప రికార్డుల మోత...!
మరి కొద్ది గంటల్లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజుగా థియేటర్లలో తన రూలింగ్ చూపించమన్నాడు. ఇప్పటికే పుష్ప 2 సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ ఒక్కడే ఈ సినిమా ప్రచారాన్ని తన భుజాన వేసుకున్నాడు. దేశం అంతా తిరిగి ప్రచారం చేశాడు. ఇక ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప 2 ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రు. 670 కోట్లకు పైగా థియేటర్ల బిజినెస్ అయింది. ఇక ఆడియో రైట్స్ డిజిటల్ రైట్స్ ఓటిటి రూపంలో రు. 400 కోట్లు వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజ్ లో బిజినెస్ చేయలేదు. దాదాపు రు. 1060 కోట్ల బిజినెస్ తో ట్రెడ్ వర్గాలలో దడ పుట్టిస్తుంది. టికెట్ల విషయానికొస్తే నెలరోజుల ముందే ఓవర్సీస్ లో టికెట్లు బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలోని హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం ఒక రికార్డు. బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత వేగంగా వన్ మిలియన్ టికెట్స్ అమ్మబడిన సినిమాగా పుష్ప 2 రికార్డుల్లో నిలిచింది.
నార్త్ ఇండియాలో పుష్ప 2 కు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్ లో 24 గంటల్లోనే లక్ష టికెట్లు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాలలో అయితే టికెట్ బుకింగ్ ఓపెన్ అయిన గంటలోనే ఫస్ట్ డే టికెట్స్ మొత్తం అయిపోయాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు సౌత్ ఇండియా .. నార్త్ .. ఓవర్సీస్ ఏ సెంటర్లో చూసిన పుష్ప 2 హంగామా ఒక రేంజ్ లో కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 55 వేల షోలు పడుతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా పుష్ప 2 రికార్డుల్లోకి ఎక్కింది. 80 దేశాల్లో ఆరు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రికార్డులు రిలీజ్ కు ముందే క్రియేట్ చేస్తున్న పుష్ప 2 రేపు రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.