అల్లు అర్జున్ 7 మూవీలకి జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..?

Pulgam Srinivas
అల్లు అర్జున్ ఆఖరి 7 మూవీలకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ కి ఏకంగా 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 144.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అల్లు అర్జున్ కొంత కాలం క్రితం అలా వైకుంఠపురంలో అనే సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 84.37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అల్లు అర్జున్ కొంత కాలం క్రితం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 76 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన దువ్వాడ జగన్నాథం మూవీ కి 79 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సరైనోడు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి మూవీ కి 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: