' పుష్ప 2 ' .. బ‌న్నీ రెమ్యున‌రేష‌న్లో మైత్రీ కోత‌ల‌.. వాత‌లు..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ ఐకాన్ స్టార్ .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా మరో రెండు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా కని వినీ ఎరగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కేవలం మన దేశంలో ఈ సినిమా ఆరు భాషలలో రిలీజ్ అవుతుంది. భారతీయ సినిమా ప్రేమికుల మాత్రమే కాదు .. ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి చెందిన .. ఏ భాషకు చెందిన సినీ ప్రేమికులు అయినా  .. ఎక్కడ ఉన్న ఏ దేశంలో ఉన్నా కూడా పుష్ప 2 సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు . ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా ? అన్న ఒక్కటే ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది.

ఈ సినిమాకు రిలీజ్ ముందే ఏకంగా రు . 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమాకు హీరోగా నటించిన అల్లు అర్జున్ కు ఎంత ? రెమ్యూనరేషన్ ఇచ్చారు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమా కు బ‌న్నీ కి ఎంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌న్న దానిపై ఆస‌క్తి క‌ర చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. సినిమా కు జ‌రిగిన బిజినెస్ మీద రు. 27 % అని ముందు ఓ మాట అనుకున్నార‌ట‌. ఈ లెక్క‌న బ‌న్నీకి రు. 270 కోట్లు ఇవ్వాలి. కానీ లెక్క‌ల త‌ర్వాత దానిని 24 %కు త‌గ్గించార‌ని టాక్ ?  అంటే రు. 240 కోట్లు ఇచ్చార‌ట‌. బిజినెస్ అనుకున్న ట్టుగా జ‌రిగినా కూడా ఎందుకో ?  గాని బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ లో మైత్రీ వాళ్ల కాస్త కోత అయితే పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: