' అఖండ 2 ' లో బాలయ్య, సంజయ్‌దత్తే కాదు.. మరో స్టార్ హీరో కూడా..?
నందమూరి నరసింహ బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకు మూడు సంవత్సరాలు అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో కరోనా సెకండ్ తర్వాత వచ్చిన అఖండ చాలా తక్కువ రేట్లతోనే భారీ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకుని బాలయ్య కెరీర్ లోనేబుల్ హిట్ సినిమాగా నిలిచింది. బాలయ్య - బోయపాటి శ్రీను కాంబో లో సింహ - లెజెండ్ - అఖండ ఒకదానిని మించి ఒకటి హీట్ అయ్యాయి. ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపించబోతున్నాడట .. ఆ హీరోది నెగిటివ్ రోల్ అని టాక్ నడుస్తోంది. నిజానికి అఖండ 2 లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సంజయ్ దత్ తో పాటు మరో సౌత్ హీరో కూడా ఉంటాడని టాక్. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపికపై దర్శకుడు బోయపాటి శ్రీను ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు కీలక పాత్రలకు ఇతర భాషల నటీ నటులను తీసుకోవాలని బోయపాటి తో పాటు నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా .... 14 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ 2025 నుంచి ప్రారంభించి 2026 సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.