' పుష్ప 2 ' ... టోట‌ల్ నిలువెత్తు దోపిడి అంటే ఇదే... ఇంత‌క‌న్నా దారుణం ఉంటుందా..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
పుష్ప .. పుష్ప .. పుష్ప .. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ భాషలో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా ఎవరి నోట విన్న పుష్ప నామస్మరణ జరుగుతోంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మూడు యేళ్ల‌ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. బన్నీకి జోడిగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన సమంత స్పెషల్ సాంగ్ లో నటించి చేసిన రచ్చ అంతా కాదు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. బాలీవుడ్లో ప్రమోషన్లు లేకుండా రిలీజ్ అయిన పుష్ప తొలిభాగం ఏకంగా రు. 100 కోట్లకు పైగా వసూలు సాధించి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు సైతం అవురా అని ఆశ్చర్యపోయేలా చేసింది. మూడేళ్ల తర్వాత పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాపై కని విని ఎరుగ‌ని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. సినిమాకు రిలీజ్ కి ముందే రు . 1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ భారీ ఎత్తున అమ్మారు. దీంతో రేట్లు కూడా చుక్క‌ల్లో ఉన్నాయి. ఇప్ప‌టికే నైజాంలో టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమ‌తులు వ‌చ్చేశాయి. రిక్లెయిన‌ర్ రేటు గ‌రిష్టంగా రు. 1239 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలి అంటే టాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లో ఏ సినిమాకు ఈ స్థాయిలో అధికారికంగా టిక్కెట్ రేట్లు గ‌తంలో ఏనాడు పెంచ‌లేదు. ఇక ముంబైలో పీవీఆర్ మ‌ల్టీఫ్లెక్స్ లలో అయితే ఏకంగా పుష్ప 2 టిక్కెట్ రేట్ రు. 3000 గా పెట్టారు. అస‌లు ఈ దోపిడీ చూసి జ‌నాలు షాక్ అవుతున్నారు. ఇది చాలా దారుణం అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: