పీలింగ్స్ కాదు మీకు ఫుల్ మీల్స్.. రష్మిక-బన్ని పై బూతు ట్రోలింగ్..!

Thota Jaya Madhuri
ఒకడు బాగుపడిపోతూ ఉంటే కచ్చితంగా పక్క వ్యక్తి చూడనే చూడలేడు . ఆ సాంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతూనే వస్తుంది.  మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయితే సినీ స్టార్స్ కూడా ఆ సాంప్రదాయాన్ని ఎక్కువగా ఫాలో అవుతూ వస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది స్టార్స్ ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఉండడం మనం గమనించాల్సిన విషయం . ఏదైనా స్టార్ హీరో నటించిన సినిమా హిట్ అవుతుంది అన్న ఆ స్టార్ హీరో చేసిన సాంగ్ హిట్ అవుతుంది అన్న వెంటనే ఒక పెద్ద పనికిమాలిన బ్యాచ్ సోషల్ మీడియాలో కాచుకుని కూర్చుంటుంది . అసలు ఆ పాటలో నెగిటివ్ లు ఏం ఉన్నాయా..?  ఆ పాటను ఏ విధంగా ట్రోల్ చేయాలా..? ఆ పాట సంక నాకి పోయేలా ఎలా చేయాలో ..? అంటూ బాగా ట్రై చేస్తూ ఉంటుంది.


ప్రెసెంట్ పుష్ప 2 పై అలాంటి ఒక బ్యాచ్ రెడీగా కాచుకొని కూర్చుని ఉంది.  రీసెంట్గా రిలీజ్ అయిన ఫీలింగ్స్ పాటపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది. చాలామందికి ఈ ఫీలింగ్స్ పాట బాగా నచ్చేసింది . మరీ ముఖ్యంగా ఈ లిరిక్స్ ఒక భార్య భర్తల మధ్య నాటు సరసాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉంది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు రష్మిక మందన్నా - బన్నీ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయి స్టెప్స్ వేసారు అని చెప్పాలి. ఎక్కడ కూడా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు శేఖర్ మాస్టర్ చెప్పిన స్టెప్ కి నో అని చెప్పకుండా వేసేసినట్లే కనిపిస్తుంది.  లిరికల్ వీడియోలోనే ఈ విధంగా ఉంటే ఇక ఫుల్ వీడియో సాంగ్ లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .


ఫీలింగ్స్ పాట చాలా మందికి ఫీలింగ్స్ కలగజేసే విధంగానే ఉంది అంటూ బన్నీ ఫ్యాన్స్ నాటి  కామెంట్స్ చేస్తున్నారు . అయితే కొంతమంది ఫీలింగ్స్ ఏమో కానీ ఈ స్టెప్స్ మాత్రం ఫుల్ మీల్స్ బన్నీ ఫాన్స్ కు కడుపు నిండిపోతాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . కానీ ఓ  పనికిమాలిన బ్యాచ్ మాత్రం సోషల్ మీడియాలో ఫీలింగ్స్ పాట పై ట్రోలింగ్ చేస్తూనే ఉంది. రష్మిక మందన్నా వేసిన స్టెప్స్ బాగోలేదని రష్మిక మందన్నాతో అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు అస్సలు బాగోలేదు అని ఒక అమ్మాయి ఇబ్బంది పడే విధంగా బన్నీ రష్మికను టచ్ చేస్తూ ఆ పాటలో చూపించారు అని కొంతమంది రాధాంతం చేస్తున్నారు.


 అసలు ఇవి స్టెప్స్ నేనా..? ఏదో కుప్పిగంతులు ఎగురుతున్నట్టు ఉంది అంటూ దారుణంగా ట్రోల్లింగ్ స్టార్ట్ చేశారు . కానీ బన్నీ ఫాన్స్ మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్న రేంజ్ లో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తూ బన్నీ ఫాన్స్ పుష్ప 2 సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా హాట్ హాట్ వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: