నావల్ల కావట్లేదు..నేను వెళ్ళిపోతా.. బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన స్టార్ కంటెస్టెంట్?

praveen
హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా ఫేమస్ అయిన షో అటు ఇండియాలోకి బిగ్ బాస్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే హిందీ తమిళ కన్నడ తెలుగు భాషల్లో కూడా ఈ షో ఎంతో పాపులారిటీని సంపాదించింది. ఇక బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కూడా పేరు సంపాదించుకుంది. అందరికీ తెలిసిన సెలబ్రిటీల గురించి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరికి తెలియని విషయాలు తెలుసుకునేందుకు ఈ షోని తెగ ఫాలో అవుతూ ఉంటారు బుల్లితెర ప్రేక్షకులు.

 ఇక ఒక్కో భాషలో ఒక్కో సూపర్ స్టార్ బిగ్ బాస్ కార్యక్రమాన్ని హోస్టు చేస్తూ అదనపు హంగులు అద్దుతూ ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదవ సీజన్ నడుస్తోంది. 13 వారాలు పూర్తిచేసుకుని 14వ వారంలోకి అడుగు పెట్టింది. అయితే కన్నడంలో ప్రస్తుతం 11 వ సీజన్ నడుస్తూ ఉండగా కిచ్చ సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే గతంలో తెలుగు బిగ్ బాస్ షోలో సందడి చేసిన శోభా శెట్టి అటు తమిళ బిగ్ బాస్ లోకి కూడా వెళ్ళింది. వైల్డ్ కార్డు ద్వారా కన్నడ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. అయితే రావడంతోనే భజన కార్యక్రమం మొదలు పెట్టడంతో హోస్ట్ సుదీప్ ఆమెకు షాక్ ఇచ్చారు. ఇక శోభ హౌస్ లో అడుగు పెట్టిన తర్వాత అక్కడ మొత్తం కల్లోలం మొదలైంది. కంటెస్టెంట్స్ తో గొడవలు పెట్టుకోవడంతో.. అక్కడివాళ్లకు అందరికీ విసుగు పుట్టింది. ఇటీవలే బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. తాను హౌస్ లో ఉండలేకపోతున్నాను. ఎలిమినేట్ చేయాలని పోస్ట్ సుదీప్ ని కోరుతూ కన్నీటి పర్యంతమైంది. అయితే సుదీప్ మరోసారి పునరాలోచించుకోవాలని ఛాన్స్ ఇచ్చినప్పటికీ శోభా తగ్గకపోవడంతో చివరికి బిగ్ బాస్ తో చెప్పి తలుపులు తెరిపించాడు. దీంతో ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: