ఫేషియల్ చేయించుకున్న తరువాత ఈ తప్పులు అసలు చేయకండి...!
ఒక్కొక్కసారి ముఖంలో గ్లోనెస్ కు బదులు పలు రకాల సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణం ఫేషియల్ కు ముందు, ఫేషియల్ కు తర్వాత చేసే చిన్న చిన్నతప్పులే కారణం. ఫేషియల్ చేసిన వెంటనే మెరుపు రాదని... దీనికి పలు రకాల జాగ్రత్తలు పాటించాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఫేషియల్ కు ముందు, ఫేషియల్ తరువాత ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు చూద్దాం. ఫేషియల్ తర్వాత జిమ్ కు వెళ్లడం, వ్యాయామాలు చేయడం మానుకోండి. ఎందుకంటే వాటి వల్ల ముఖంపై చమట పట్టి, చర్మానికి హాని కలిగిస్తుంది. ఇలా చెయ్యటం వల్ల ముఖంలోని మెరుపు కూడా తగ్గిపోతుంది.
దీనికి బదులు ప్రతిరోజు నీటిని ఎక్కువగా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది. ఫేషియల్ చేయించుకోవడానికి ముందు, తరువాత థ్రెడ్ చేయించుకోకుడదు. ఇది ముఖంపై దద్దుర్లు వచ్చేలా చేస్తుంది. ఫేషియల్ తర్వాత వ్యాక్స్ చేయించుకోకపోవడమె మంచిది. ఫేషియల్ తరువాత నేరుగా సూర్యకాంతిలో వెళ్లడం మంచిది కాదు. ఫేషియల్ తర్వాత చర్మం చాలా సున్నితంగా మారుతుంది... సూర్య కిరణాలు చర్మం పై నేరుగా పడటం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సాయంత్రం పూట ఫేషియల్ చేయించుకోవడం బెటర్. పగటిపూట ఫేషియల్ చేయించుకున్నట్లయితే పార్లర్ నుంచి బయటకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ స్కిన్ ని ఉపయోగించుకోవాలి. దీనికి కారణం ఫేషియల్ కు ముందు, ఫేషియల్ కు తర్వాత చేసే చిన్న చిన్నతప్పులే కారణం.