యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో పాటు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై కూడా ప్రభాస్ పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ చిత్రాన్ని పూర్తి చేసిన ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ‘ప్రాజెక్ట్ K’ అనే సినిమాలో నటిస్తున్నాడు.అంతేగాక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా ఇప్పటికే అనౌన్స్ చేశాడు.అయితే పోలీస్ డ్రామాగా ఇది రానుంది. ఇటీవలే దీని మ్యూజిక్ సిటింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత భూషణ్‌కుమార్ ‘భూల్ భూలయ్యా 3’ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ‘స్పిరిట్’ షూటింగ్ గురించి మాట్లాడారు. మేము ప్రస్తుతం ‘స్పిరిట్’ పనుల్లో బిజీగా ఉన్నాం. అందులోని నటీనటుల ఎంపిక ఇంకా ఖారారు కాలేదు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తాం. దీని తర్వాత షూటింగ్ పనులు మొదలుపెడతాం.
డిసెంబర్ చివరిలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ ఉంటుంది. వెంటనే సందీప్ వంగా ‘యానిమల్ పార్క్’ను మొదలుపెడతారు’ అని చెప్పారు.దీంతో త్వరలోనే ‘స్పిరిట్’ అప్డేట్లు వరుసగా వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా దీపావళి రోజు ఈ సినిమా మ్యూజిక్ పనులు మొదలయ్యాయని చిత్రబృందం తెలిపింది. ఈమేరకు చిత్ర సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. హర్షవర్ధన్, సందీప్ ట్యూన్స్ ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. ఇదిలావుండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ని తీసుకుంటూన్నట్లు సమాచారం. త్వరలోనే మూవీకి సంబంధించిన అప్డేట్స్ ను మేకర్స్ వెల్లడించనున్నారు.ఇదిలావుండగా భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు అభిమానులకు దగ్గరైంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా. ప్రస్తుతం రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ లో కియారా హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీ విడుదల కు సిద్ధంగా వుంది.