కాబోయే జంటకి ఖరీదైన బహుమతి ఇచ్చిన నాగార్జున.. ఖరీదు ఎంతంటే..?
ఇప్పటికే గతంలో శోభిత దూళిపాల తమ తల్లి గారి ఇంట్లో పెళ్లికి సంబంధించిన గోధుమ రాయి, పసుపు దంచడం వంటి కార్యక్రమాలు పూర్తి చేసింది. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం నాగచైతన్య శోభిత కి సంబంధించిన హల్దీ వేడుకలను కూడా అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి మరీ నిర్వహించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కాబోయే నూతన జంటకి నాగార్జున ఖరీదైన బహుమతిని ఇచ్చినట్లు తెలుస్తోంది.
అసలు విషయంలోకెళితే.. నాగార్జున తాజాగా రూ.2.10 కోట్ల విలువైన లెక్సస్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల హైదరాబాదులో దానికి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించారు. ఇప్పుడు ఆ కారును కొడుకు కోడలికి బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాలను కూడా కాబోయే కోడలికి అక్కినేని కుటుంబం బహుమతిగా ఇవ్వబోతోందట.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.. కానీ ఎలక్ట్రిక్ కారు కొన్న విషయం నిజమే అయితే ఇది వారికి ఇస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరోవైపు నాగచైతన్య తండేల్ సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.