ఈ హాట్ క్వీన్ గుర్తుందా .. ఇప్పుడు పేరే మార్చేసుకుంది .. దెబ్బకు ఇండస్ట్రీ నుంచి పారిపోయిందిగా ..!
రానా దగ్గుబాటి మొదటి సినిమా లీడర్ సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన టాలెంటెడ్ యాక్ట్రెస్ రిచా గంగోపాధ్యాయ్ .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎవరికి కనిపించడం లేదు . రానా తో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కు తర్వాత స్టార్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి .. ఇక తన రెండో సినిమాలోనే విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది .. రజనీకాంత్ చంద్రముఖి సినిమాకి సిక్వల్ గా వచ్చిన నాగవల్లి సినిమా అంతగా ఆటలేదు .. ఆ తర్వాత హరి శంకర్ దర్శకత్వం లో వచ్చిన మిరపకాయ్ సినిమాలో వినమ్రాస గా సంప్రదాయంగానే అందాల ఆరబోతతో మెప్పించింది . ఆ తర్వాత రెండు తమిళ సినిమాలు , ఒక బెంగాలీ సినిమా చేసి మళ్లీ తెలుగు సినిమాల్లో అడుగు పెట్టింది . మిరపకాయ్ తర్వాత రెండోసారి రవితేజ తో సారొచ్చారు సినిమాలో నటించింది.
ఇక తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి మూవీలో మానసగా నటించి అదరగొట్టింది . ఇక చివరిగా నాగార్జున హీరోగా వచ్చిన భాయ్ సినిమాలో నటించి సినిమాల కు గుడ్ బాయ్ చెప్పేసింది . సాఫీగా సాగుతున్న కెరీర్లో ఏమైందో ఏమో కానీ 2013 లో తాను సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించింది . సినిమాలకు ముందు అమెరికా నుంచి వచ్చిన రిచా.. తిరిగి ఆ దేశం వెళ్లిపోయారు . అనంతరం అక్కడ ఎంబీఏ పూర్తి చేశారు. అక్కడే తన క్లాస్మెట్ని ప్రేమించి పెళ్లాడింది . అనంతరం ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అనంతరం తన పేరును రిచా లాంగేళ్లగా మార్చుకుంది .