టీవీ: రెమ్యూనరేషన్లో రికార్డ్ సృష్టించిన ఉదయభాను.. వారి వల్ల కెరియర్ నాశనం..!
అలా మొదటిసారి హృదయాంజలి అనే ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిందట..ఆ తర్వాత సాహసం చేయరా డింభకా, జానవులే నెరజాణవులే, తదితర షోలకు యాంకర్ గా చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ఆ సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో.. లీడర్, ఎర్రసైన్యం, కొండవీటి సింహం తదితర చిత్రాలలో కూడా నటించింది. ఆ సమయంలోనే వెండితెర, బుల్లితెర పైన నటిస్తున్న ఉదయభాను పైన కొంతమంది గాసిప్ రాయుళ్లు పలు రకాల పుకార్లు ఈమె జీవితంలో పుట్టించారట.. ముఖ్యంగా ఈమెకు చాలామందితో ఎఫైర్లు అంటకడుతూ సీక్రెట్ మ్యారేజ్ చేసుకోని ఇలా ఎన్నో రూమర్స్ సృష్టించారట. వీటి వల్ల కూడా చాలా సఫర్ అయ్యానని ఇలా కూడా ఎన్నో అవకాశాలు తగ్గిపోయాయని తెలిపింది.
కానీ ఉదయభాను బుల్లితెరకు దూరం కావడానికి ముఖ్య కారణం పెళ్లి తర్వాత సుమారుగా 10 ఏళ్ల తరువాత ట్విన్స్ జన్మించారని.. వారి యొక్క ఆలనా పాలన చూస్తూ ఉండడంతోనే ఉదయభాను సినీ కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయిందని.. ఆ తర్వాత ఉదయభాను కంటే కొత్త యాంకర్స్ ఎంట్రీ ఇవ్వడంతో ఉదయభానుకి అవకాశాలు తగ్గిపోయాయట. 2004లో విజయ్ కుమార్ ని వివాహం చేసుకుంది.. వీరికి భూమి ఆరాధ్య, యువి నక్షత్ర ఇద్దరు పిల్లలు జన్మించారు.. వీరివల్లె ఉదయభాను ఇండస్ట్రీకి దూరమైందని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.