ఇండస్ట్రీలో మరో సంచలనం.. విడాకులు తీసుకోబోతున్న మోస్ట్ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ కపుల్..!?
అయితే తాజాగా సోషల్ మీడియాలో ధనుష్ - ఐశ్వర్య విడాకులకు సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అయ్యాయో చూసాం . నాగచైతన్య - సమంత తర్వాత ధనుష్ -ఐశ్వర్య ల విడాకుల వార్తలు అంత హైలైట్ గా మారాయి . అయితే తాజాగా మరొక స్టార్ సెలబ్రిటీ కూడా విడాకులు తీసుకోబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది . తెలుగు ఇండస్ట్రీలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రేయ శరణ్ కూడా తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . కాగా భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగానే భర్తకు దూరంగా ఉంటుందట .
అంతేకాదు కుటుంబ సభ్యులు కూడా అతడికి విడాకులు ఇచ్చేసేయ్ అంటూ సజెస్ట్ చేస్తున్నారట . అయితే మొదటి నుంచి భర్త పట్ల చాలా ప్రేమ ఉన్న శ్రియ శరణ్.. భర్తను మార్చుకోవడానికి ట్రై చేస్తుందట. ఫైనన్షియల్ పరంగానే వీళ్ళకి గొడవలు మొదలయ్యాయి అంటూ కూడా ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. అయితే నిజంగానే శ్రేయ విడాకులు తీసుకుంటుందా..? అన్నదానిపై అఫీషియల్ ప్రకటన ఎక్కడా లేదు. అంతేకాదు శ్రేయ శరణ్ కూడా
భర్తకు దూరంగా ఉంటుంది అన్న కారణంగానే వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారు అన్న రూమర్స్ ఎక్కువ అయ్యాయి అంటున్నారు జనాలు. శ్రియ శరణ్ ఎప్పుడూ తన భర్త తన పాపతో కలిసి ఫొటోస్ దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేసేది.. కానీ ఈ మధ్యకాలంలో భర్తకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేయడం మానేసింది . దీంతో నిజంగానే ఆమె తీసుకోబోతుందా..? అంటూ జనాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు . ఈ వార్తలకు చెక్ పడాలి అంటే శ్రియ స్పందించాల్సిందే..!?