పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ నవదీప్ ఫన్నీ చాటింగ్.. నెట్టింట వైరల్..!
ఇటీవల యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ అయిన రహస్య గోరఖ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే నాగచైతన్యకు సమంతతో పెళ్లి జరిగి విడాకులు తీసుకుని మరో పెళ్లికి సైతం సిద్ధమైపోయాడు. నిజానికి చైతు బ్యాచిలర్ లిస్టులోకి రాడు కానీ మీమర్ ఎవరో ఆయన్ని కూడా పెళ్లి కానీ ప్రసాదుల లిస్టులో కలిపేశాడు. అలాగే అక్కినేని అఖిల్ కూడా ఇంటివాడు కాబోతున్నాడు. గతంలో అఖిల్ కు నిశ్చితార్థం జరగా పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు తాజాగా జైనబ్ రవ్జీతో నిశ్చితార్థం కూడా జారిగింది. త్వరలోనే అఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. దీంతో అఖిల్ కూడా బ్యాచిలర్ లిస్టులో నుండి బయటకు వచ్చేసాడు.
నటుడు నారా రోహిత్, 'ప్రతినిధి 2' హీరోయిన్ శిరీషతో త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. దీంతో వీరందరూ సింగిల్స్ గ్రూప్ నుండి లెఫ్ట్ అయ్యారు. గ్రూప్ లో నవదీప్ 'ఏంటి బాబాయిస్ అందరూ అలా వెళ్లిపోతున్నారు' అని మెసేజ్ చేయగా.. దానికి సాయి ధరమ్ తేజ్ 'సోలో బతుకే సో బెటర్' అంటూ బదులిచ్చాడు. ఈ మీమ్ వైరల్ అవ్వగా నవదీప్ షేర్ చేశాడు. ఏమంటావ్ మామా అంటూ సాయి ధరమ్ తేజ్ ను ట్యాగ్ చేశాడు. అంతే కాకుండా ప్రభాస్ ఏమో అని ఎక్స్ ప్రెషన్ ఇచ్చినట్టుగా ఫోటో పెట్టారు. మరి నవదీప్ స్టోరికి సాయి ధరమ్ తేజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.