అల్లు అర్జున్ కి ఆ ఇద్దరినీ దూరం చేసిన పుష్ప2.. దెబ్బకు బన్నీ మైండ్ బ్లాక్..!

Amruth kumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడు తాను అందరి వాడిని అని అనిపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అందరితో మంచిగా ఉండాలని కూడా అనుకుంటాడు. అయితే అది ఆచరణలోకి వచ్చేసరికి తేడా కొడుతూ కొందరిని దూరం చూసుకుంటున్నాడు. అది అనుకుని జరుగుతుందో లేక తెలియక తన వాళ్లు అనుకున్న వాళ్లు కూడా దూరమవుతూ వస్తున్నారు. అయితే ఇలా దూరమవుతున్న విషయంలో ఆయన తప్పు లేకపోవడం గమనార్హం. ఇక్కడ మీరే చూడండి బన్నీ అంటే ఎంతో గొప్పగా అభిమానించే ఇద్దరు సినిమా జనాలు ఇప్పుడు ఆయన నుంచి దూరం అవుతున్నట్లు తెలుస్తుంది.

ఒకరు స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ .. మరొకరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్.. ఈ ఇద్దరు కూడా అల్లు అర్జున్ కు ఎంత క్లోజ్ గా ఉంటారో కొత్తగా చెప్పక్కర్లేదు . దేవిశ్రీప్రసాద్‌ను కదిపితే చాలు అల్లు అర్జున్ గురించి ఏదో ఒక విషయం చెబుతూనే ఉంటారు . జానీ మాస్టర్ కు కూడా బన్నీ చాలా అవకాశాలు ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఆయన స్టార్ అయ్యాడు .. ఈ ఇద్దరు అల్లు అర్జున్‌కు దూరమవుతున్నారు. అయితే జానీ మాస్టర్ విషయంలో తమకు తమ హీరోకు ఎలాంటి సంబంధం లేదని గతంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీగా చెప్పిన .. ఆ మొత్తం గొడవ అంతా పుష్ప 2 సెట్ లోనే జరిగిందని టాక్ బయటకు వస్తుంది.

ఈ క్రమంలో బన్నీ మరోవైపు స్టాండ్ తీసుకోవడంతోనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బయటికి వచ్చి ఈ విషయం చెప్పారని కొందరు అంటున్నారు. అలాగే పుష్ప 2 మ్యూజిక్ విషయంలో నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేయటంలో డిఎస్పి స్థానంలో ఇతర సంగీత దర్శకులు వచ్చారు అని మొన్న చెన్నైలో జరిగిన ఈవెంట్తో అందరికీ అర్థమైంది. ఈ విధంగా దేవిని కూడా బన్నీ తన సినిమాలకు దూరం చేసుకున్నాడని చెప్పాలి. ఇక తర్వాత ఆయనతో సినిమా చేస్తాడు కదా అంటే ఆ సినిమా త్రివిక్రమ్ తో కన్ఫర్మ్ అయింది .. ఆయన సినిమాలకు దేవి కష్టమని కూడా అంటున్నారు .. ఈ లెక్కన బన్నీకి జానీ మాస్టర్, దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్లే అని తేలిపోతుంది. ఆయన బయట స్నేహం మాత్రం అలానే ఉంటుందని చెప్పవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: