పష్ప 3 తీయడం బన్నీకి ఇష్టం లేదా.. కారణం అదేనా..?

murali krishna
అల్లు అర్జున్ కెరీర్లోనే పుష్ప సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా వైడ్ స్టార్ డమ్ వచ్చింది. దీంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉండొచ్చు అని వార్తలు వచ్చాయి.నిర్మాతలు కూడా ఇటీవల దీనిపై మాట్లాడుతూ పార్ట్ 3 కు ఛాన్స్ ఉంది కానీ ఇప్పట్లో ఉండకపోవచ్చు అని చెప్పారు. దీంతో పుష్ప 3 కూడా ఉందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.ఐతే ‘పుష్ప’ కోసం ఇప్పటికే ఐదేళ్ల దాకా సమయం పెట్టాడు అల్లు అర్జున్. మళ్లీ ఇంకో రెండు మూడేళ్లు ఇదే కథ కోసం పెడతాడా.. అయినా ఇంకో పార్ట్ తీస్తే కథను సాగదీసినట్లు అనిపించదా అన్న సందేహాలు తలెత్తాయి.ఐతే ఇప్పుడు స్వయంగా అల్లు అర్జునే ‘పుష్ప-3’ గురించి మాట్లాడారు.ఇక బన్నీ లేటెస్ట్‌గా పెట్టిన సోషల్ మీడియా పోస్టును చూస్తే అతడికి మూడో భాగం చేసే ఆలోచనేమీ లేదని అనిపిస్తోంది. పుష్ప-2 షూట్ పూర్తయిన నేపథ్యంలో బన్నీ లొకేషన్ నుంచి ఒక ఫొటో పెట్టి ఐదేళ్ల పుష్ప ప్రయాణం పూర్తయిందని కామెంట్ పెట్టాడు. ఇలా జర్నీ పూర్తయింది అనేసరికి బన్నీకి పార్ట్-3 చేసే ఉద్దేశం లేదేమో అనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది.గతంలో మరే చిత్రానికీ లేనన్ని కాల్ షీట్స్ ఈ సినిమాకే ఇచ్చి బన్నీ విసిగిపోయినట్లు తెలుస్తోంది. సుకుమార్‌తో ఎంత మంచి అనుబంధం ఉన్నప్పటికీ బన్నీ 'పుష్ప' విషయంలో తీవ్ర అసహనానికి గురైనట్లు గుసగుసలు వినిపించాయి.. అందుకే 'పుష్ప-2' తర్వాత ఒక ఎమోషనల్ బ్రేక్ అవసరమని బన్నీ భావిస్తున్నాడట. ఈ పాత్ర ఎంత నచ్చినప్పటికీ.. 'పుష్ప-2' సక్సెస్ మీద కూడా ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ 'పుష్ప-3' చేసే విషయంలో బన్నీ అంత సుముఖంగా లేడని సమాచారం.దీంతో బన్నీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప 2 పార్ట్స్ కోసం ఆల్మోస్ట్ 4 ఏళ్ళు సమయం ఇచ్చారు. ఇప్పుడు పార్ట్ 3 అంటే ఇంకో రెండు, మూడేళ్లు ఇవ్వాల్సి వస్తుందని అలా అన్నారేమో బన్నీ. అయితే ఫ్యూచర్ లో కొన్ని సినిమాల తర్వాత సుకుమార్,అల్లు అర్జున్ వేరే సినిమాల కమిట్మెంట్స్ అయ్యాక పుష్ప 3 ఉండొచ్చేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: