అఖిల్‌ ఎంగేజ్మెంట్‌..శోభితకు కొత్త కష్టాలు ?

Veldandi Saikiran
అక్కినేని హీరో అఖిల్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇప్పటివరకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అతను ఎంగేజ్మెంట్ జరుపుకొని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. జైనాబ్ రావడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. హైదరాబాద్ లోనే నాగార్జున ఇంట్లో కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. కాబోయే కొత్తజంట ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించాడు. 


దీంతో ఒక్కసారిగా అఖిల్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు సిని ప్రముఖులు, నెటిజెన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో అయ్యగారు సడన్ గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారేంటి అని సినీ ఫ్యాన్స్ క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలియాల్సి ఉంది. కాగా, డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం జరగనుంది. ఒకవేళ ఇదే వేదికపై అఖిల్ వివాహం కూడా జరుగుతుందా అని కొంతమంది ఆరా తీస్తున్నారు.


ఒకవేళ అదే రోజున ఇద్దరి వివాహాలు జరుగితే అక్కినేని అభిమానులకు డబల్ ట్రీట్ ఉండనుంది. కాగా, అఖిల్ వివాహం జరిగితే అక్కినేని కుటుంబంలో శోభితకు ప్రాధాన్యత తగ్గుతుందని కొంతమంది అంటున్నారు. జైనాబ్ రావడ్జీ కూడా నటి. అంతేకాకుండా చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కోట్లకు వారసురాలు. జైనబ్ రావడ్జీ రాకతో శోభితకు కాస్త ప్రాధాన్యత తగ్గుతుందని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఇదే కనుక జరిగితే శోభితకు కష్టాలు మొదలైనట్లేనని అంటున్నారు. ఈ వార్తలో ఏ మేరకు వాస్తవం ఉందో చూడాలి. ఇక డిసెంబర్ 4న నాగచైతన్య, శోభిత వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగనుంది. వివాహానికి సమయం దగ్గర పడుతుండడంతో పెళ్లి పనులు హడావిడిగా జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: