అప్పుడు లెజెండ్.. ఇప్పుడు పుష్ప2.. దేవిశ్రీ ఎందులోనూ తగ్గట్లేదుగా..!

Amruth kumar
పుష్ప 2 సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌ని కాదని, బిజిఎం కోసం చిత్ర యూనిట్ మరికొందరు సంగీత దర్శకులను ఈ సినిమా కోసం వాడుకున్నారు. ఈ నిర్ణయంతో దేవిశ్రీ బాగా హట్‌ అయినట్లు కనిపిస్తుంది. రీసెంట్ గా చెన్నైలో జరిగిన వైల్డ్ ఫెయిర్ ఈవెంట్ వేదికగా డీఎస్పీ తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశాడు. సినిమా నిర్మాతకి తన మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. టైం కి పాట ఇవ్వలేదని టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని అంటూ ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇలాంటివి ఎవరూ లేనప్పుడు అడిగితే పెద్దగా కిక్ ఉండదని స్టేజి మీద ఇలా ఓపెన్ గా అడిగేయాలని ఆయన అన్నారు.

అయితే నిజానికి వివాదాలకు దూరంగా ఉంటూ తన మ్యూజిక్తో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు దేవిశ్రీప్రసాద్. తనను ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం అప్పటికప్పుడు వారికి బదులు చెబుతూనే ఉంటారు. ఏ విషయంలో ఆయనన అందరి ముందు కుండలు బద్దకొట్టడానికి ఎప్పుడూ వెనకాడరు. అయితే ఇప్పుడు పుష్ప2 ఈవెంట్లో మాద‌రిగానే గతంలో లెజెండ్ సినిమా వేడుకల్లో కూడా డీఎస్పీ ఇలానే మాట్లాడాడు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడిన మాటలపై స్టేజ్ మీదనే తన అభ్యంతరం చెప్పాడు. దర్శకుడు దగ్గర మైక్ తీసుకుని తాను ఎంత కష్టపడి పని చేయాలో దాని గురించి ఇంకొకరు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు అంటూ నవ్వుతూనే కాస్త ఘాటుగా స్పందించాడు .. ఇక ఇది అప్పట్లో కాస్త హాట్ టాపిక్ గా కూడా మారింది.

సరిగ్గా పదేళ్ల తర్వాత ఇప్పుడు 'పుష్ప 2' ఈవెంట్ లో మ‌రాల‌ జరిగింది. "మనకు ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలి. అది నిర్మాతల దగ్గర పేమెంట్ అయినా, స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు" అని దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అలానే నిర్మాత రవిశంకర్‌ ను ప్రస్తావిస్తూ.. "నేను స్టేజ్ మీద ఎక్కువసేపు మాట్లాడానని నన్ను ఏమీ అనొద్దు. ఎందుకంటే.. నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు. మీకు నాపై చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు కంప్లెయింట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద మీకు ప్రేమ కంటే కంప్లైట్స్ ఎక్కువగా ఉంటాయి ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా రాంగ్‌ టైమింగ్‌, లేట్ అన్నారు. ఇవ్వన్నీ సెపరేట్ గా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్‌గా అడిగేయాలి. సో నేనెప్పుడూ ఆన్‌ టైం'' అని డీఎస్పీ అన్నారు. ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: