లిప్ స్టిక్ పెట్టుకుందని భార్యపై పగ.. అలియా భట్ పై ప్రతీకారం తీర్చుకున్న రణబీర్..?

Pandrala Sravanthi
ఏంటి ఆలియా భట్ లిప్ స్టిక్ పెట్టుకుందని రణబీర్ అంత కక్ష కట్టారా..ఇంతకీ తన భార్య లిప్స్టిక్ వేసుకుంటే రన్బీర్ కి ఎందుకు నచ్చలేదు అనేది ఇప్పుడు చూద్దాం.సెలబ్రిటీ నుండి మామూలు జనాల వరకు ప్రతి ఒక్కరు మేకప్ లేనిదే బయటికి రావడం లేదు. ఆడైనా మగైనా మేకప్ వేసుకుంటున్నారు. అయితే అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి అలియాభట్ లిప్స్టిక్ పెట్టుకోవడం ఆమె భర్త హీరో రన్బీర్ కపూర్ కి అస్సలు నచ్చదట. అయితే ఈ విషయాన్ని అలియా భట్  ఓ సందర్భంలో ఈ విషయం బయటపెట్టిన సమయంలో రణబీర్ కపూర్ పై చాలామంది ట్రోల్స్ చేశారు. అయితే తాజాగా అప్పుడు ట్రోల్స్ చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకొని అలియాభట్ పై రణబీర్ పగ తీర్చుకున్నారు అంటూ ఒక రూమర్ బీటౌన్ లో వినిపిస్తోంది. 

అదేంటయ్యా అంటే..తాజాగా గోవాలో ఇఫీ అవార్డ్స్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న అలియా భట్ రన్బీర్ కపూర్ గురించి ఓ సీక్రెట్ బయట పెట్టారు. నేను మొదట అలియా భట్ ని కలిసిన సమయంలో ఆమె ఇంతకీ ఈ కిషోర్ కుమార్ ఎవరు అంటూ చాలా అమాయకంగా అడిగింది. ఇక ఆమె అమాయకపు మాటలు నాకు ఎంతగానో నచ్చాయి అంటూ చెప్పారు. అయితే కిషోర్ కుమార్ అంటే ఒకప్పటి దిగ్గజ బాలీవుడ్ నటుడు. ఈయన రన్బీర్ కపూర్ తండ్రి కంటే ముందేనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 అయితే బాలీవుడ్ రంగంలో రాణిస్తున్న అలియా భట్ కి అంత పెద్ద బాలీవుడ్ దిగ్గజ నటుడు తెలియదా అని రణబీర్ కపూర్ చెప్పిన ఈ విషయాన్ని వైరల్ చేస్తూ కొంత మంది జనాలు అలియా భట్ ని ట్రోల్ చేస్తున్నారు. కానీ అలియాభట్ అభిమానులు మాత్రం రన్బీర్ కపూర్ కావాలనే స్టేజ్ పై అలియా భట్ పరువు తీస్తారు. ఎందుకంటే లిప్స్టిక్ పెట్టుకోవడం రన్బీర్ కపూర్ కి ఇష్టం లేదని అలియా భట్ చెప్పి ఎలా అయితే రన్బీర్ కపూర్ మీద ట్రోల్స్ వచ్చేలా చేసిందో ఇప్పుడు రివేంజ్ తీర్చుకోవడానికి రన్బీర్ కూడా అలా చేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: