హాట్‌ బ్యూటీతో మహమ్మద్ సిరాజ్ ఎఫైర్‌....ఆ ఫోటోలు లీక్‌ ?

frame హాట్‌ బ్యూటీతో మహమ్మద్ సిరాజ్ ఎఫైర్‌....ఆ ఫోటోలు లీక్‌ ?

Veldandi Saikiran
మహమ్మద్ సిరాజ్.... ఐపిఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. 12.25 కోట్లకు సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. సిరాజ్ గత ఏడు సంవత్సరాల నుంచి ఆర్సీబీలో ఉన్నాడు. ఇప్పుడు ఆర్సిబిని విడిచిపెట్టిన అనంతరం సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ ను షేర్ చేసుకున్నాడు. అందులో సిరాజ్ ఒక వీడియోను పంచుకున్నాడు. అందులో సిరాజ్ ఆర్సిబితో గడిపిన ప్రత్యేకమైన క్షణాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు.

ఈ వీడియోలో సిరాజ్ కి ఆర్సిబి మధ్య ఉన్న అనుబంధం కనిపించింది. ఇదిలా ఉండగా..... మహమ్మద్ సిరాజ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహమ్మద్ సిరాజ్ ప్రేమలో పడ్డాడా? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు బయట ఎక్కడా కూడా కనిపించినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఫాలో చేసుకోవడం, ఒకరికి ఒకరు ఫోటోలను లైక్స్ కొట్టడం వంటివి చేస్తున్నారట. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని జోరుగా వార్తలు హల్చల్ అవుతున్నాయి. గతంలో సినీ తారలతో ప్రేమాయణం నడిపిన క్రికెటర్లు కూడా ఇలాగే ముందుగా సోషల్ మీడియాలో ఒకరికొకరు ఫాలో అవుతూ పోస్టులకు లైక్స్ చేసుకున్న వారే కావడంతో సిరాజ్, మహీర శర్మ ప్రేమ వార్తలకు ప్రాధాన్యత పెరుగుతోంది.

క్రికెటర్లు, సినీ తారలతో ప్రేమాయణం నడపడం కొత్త ఏమీ కాదు. చాలామంది ఈమధ్య అలానే చేస్తున్నారు. ఎన్నో జంటలు ప్రేమించుకుని వివాహం చేసుకున్నవారు ఉన్నారు. ఇక మహమ్మద్ సిరాజ్ కూడా మహీర శర్మతో డేటింగ్ చేస్తున్నట్టుగా జోరుగా ప్రచారాలు సాగడంతో వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: