ఐశ్వర్య రాయ్ కి లీగల్ నోటీసులు .. ఆ సినిమాలో అలా చేయడమే కారణమా...!
గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో చేసిన లిప్ లాక్ సీన్ కారణంగా తనకు లీగల్ నోటీసులు వచ్చాయని చెప్పింది. ఆ సన్నివేశంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తారని కూడా ఆమె వివరించింది. ప్రధానంగా తనను చాలా మంది అమ్మాయిలు రోల్ మోడల్ గా భావించే వారు ఆ సీన్లను తప్పుపట్టారు. తాను యువతరంకు ఆదర్శంగా ఉండాలని కోరుకునే వారి నుంచి ఇలాంటి నోటీసులు రావడం ఆశ్చర్యంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.
అలాగే ఐశ్వర్య రొమాంటిక్ సీన్ల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు అంత సౌకర్యంగా ఉండదని చెప్పింది నటిగా తన పని తాను చేస్తున్నానని కానీ ఒక సినిమాల్లో కొన్ని సెకండ్ల సీన్ కోసం ఎందుకు తనను వివరణ ఇమ్మంటున్నారు అర్థం కాలేదని చెప్పింది. హాలీవుడ్ , యూరోపియన్ సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేయటం లేదా ఆన్ స్క్రీన్ లిప్ కిస్ చేయటం తనకు ఇష్టం లేక ఆఫర్లు రిజర్వ్ చేస్తున్నట్లు గుర్తు చేసింది .. హాట్ సీన్స్ చేయడం తనకు ఇష్టం లేదని ఐశ్వర్య రాయ్ చెప్పినా.. ప్రొవోక్డ్, శబ్ద్, ఏ దిల్ హై ముష్కిల్ వంటి సినిమాల్లో ఆమె ఇంటిమేట్ సీన్స్‌లో నటించింది . ధూమ్ 2 తర్వాత కూడా ఇలాంటి రోల్స్, సీన్స్ చేయడం కొనసాగించింది. దీంతో ఆమెను కొందరు తప్పుబట్టారు.