పుష్ప2 కోసం అందరికన్న తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంది ఆమె.. సుక్కు అన్యాయం చేసేసాడే..!?

Thota Jaya Madhuri
"పుష్ప2" ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమాకి సంబంధించిన వార్తలు మారుమ్రోగిపోతున్నాయి . మరీ ముఖ్యంగా సుకుమార్ కెరియర్ లో ఎంతో హై బడ్జెట్ తో తెరకెక్కించిన  మూవీ ఇదే కావడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది . డిసెంబర్ ఐదవ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్  గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసాడు సుకుమార్ . త్వరలోనే మరింత స్థాయిలో సినిమా ప్రమోషన్స్ ను ముందుకు తీసుకెళ్లబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది .


 అల్లు అర్జున్ ఐదేళ్ల కష్టానికి సంబంధించిన లాస్ట్ ఫైనల్ షాట్ ను కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి సంచలనానికి తెరలేపాడు.  కాగా ఇప్పుడు పుష్ప2 సినిమాకి సంబంధించిన నటీనటులు రెమ్యూనరేషన్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. అందరికన్నా హైయెస్ట్ గా అల్లు అర్జున్ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ 130 తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . షేర్స్ కూడా తీసుకోబోతున్నాడట. అయితే ఆ తర్వాత స్థాయిలో సుకుమార్ ఈ సినిమా కోసం 70 కోట్ల పారితోషకం తీసుకున్నారట .


కాగా ఆ తర్వాత రష్మిక మందన్నా ఈ సినిమా కోసం పది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అంతేకాదు శ్రీ లీల ఐటమ్ సాంగ్ లో కనిపించినందుకు గాను ఏకంగా మూడు కోట్లు ఛార్జ్ చేసిందట . అయితే సినిమాకి ఎంతో హైలైట్ అవుతుంది అనుకున్న క్యారెక్టర్ అనసూయ మాత్రం ఈ సినిమా కోసం కేవలం కోటి రూపాయలు మాత్రమే పారితోషకం తీసుకుందట . పుష్ప వన్ సినిమాకు గాను ఆమె 50 లక్షలకు కాల్ షీట్స్ ఫీల్ చేసుకుందట . అయితే పుష్ప2కి కేవలం కోటి రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకుంది అంటూ వార్తలు వినిపించడంతో సుకుమార్ అనసూయకు అన్యాయం చేశాడు అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు .


సుకుమార్ తన సినిమాలో అనసూయ క్యారెక్టర్ ని ఏ విధంగా చూపించబోతున్నాడో అంటూ జనాలు ఫుల్ డీలా పడిపోతున్నారు . కాగా  పుష్పవన్ లో అనసూయ పాత్ర చాలా తక్కువగా కనిపించింది . పుష్ప 2 లో అయినా సరే ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది అంటూ జనాలు వెయిట్ చేస్తున్నారు . అసలు పుష్ప2 సినిమాలో అనసూయ పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే ..అంటే డిసెంబర్ 5 వరకు మనం వెయిట్ చేయక తప్పదు..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: