బ్రేకప్ నిజమే.. జీవితంలో పెళ్లి చేసుకోను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?

praveen
బాలీవుడ్ ఐటెం బాంబ్ మల్లిక శరావత్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్ద కాలం కిందట ఆమె హవా బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో అన్నిటిలో కూడా కొనసాగింది. ప్రత్యేకించి పెద్ద హీరోలు నటించిన సినిమాలలో ఐటెం సాంగ్స్ కి ఆమె స్టెప్పులు వేసింది. ఈ క్రమంలో ఆమె ఐటమ్ భామగా పేరుగాంచింది. అది మాత్రమే కాకుండా ఆమె నిత్యం పలు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఎల్లప్పుడూ మీడియాలో తలలో నాలుక లాగా ఉంటూ తన ఉనికిని చాటుకుంది. అయితే కొన్నాళ్ల క్రితం నుండి మాత్రం ఆమె తన పూర్తి వ్యక్తిగత జీవితంలో తనామునకలై ఉంది. ఈ క్రమంలోనే ఆమె గురించి నాకు ఒక ఆసక్తికరమైన సంఘటన మీడియాలో వినబడింది.
అవును, ప్రస్తుతం ఆమె తన సహచరుడి నుండి విడిపోతున్నట్టు వార్తలు రావడంతో, అది నిజమే అంటూ తన బ్రేకప్ కి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "ఇది నాకు కష్టకాలం. దయచేసి మా ప్రైవసీను అందరూ గౌరవించండి. సరియైన లైఫ్ పార్ట్నర్ ని పొందడంలో నేను మరోసారి ఓడిపోయాను. 100% మనకు నచ్చిన పార్ట్నర్ను పొందడం అనేది కలలాగే మిగిలిపోతూ ఉంటుంది. సరిగ్గా నా జీవితంలో కూడా అదే జరిగింది. దయచేసి మా నిర్ణయాన్ని స్వాగతించండి!" అని పేర్కొంది. దాంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే నటి మల్లికా శెరావత్ గురించి అందరికీ తెలిసిందే. మర్డర్, దశావతారం, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి పలు సినిమాల ద్వారా ఆమె తన నటన కనబరిచింది. ఇంకా అనేక పెద్దపెద్ద సినిమాలలో ఆమె స్పెషల్ సాంగ్స్ ద్వారా సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కాగా తాజాగా ఆమె తన ప్రియుడు గ్రిల్ ఆప్షన్ ఫాన్స్ కి బ్రేకప్ చెప్పి సింగిల్ గా మారింది. దాంతో త్వరలో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఆమెని మరల మనం వెండితెర పైన చూడబోతున్నాం అన్నమాట!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: