"ఏం బన్నీ..ఆ రోజులు మర్చిపోయావా..?"..వీడియో ప్రూఫ్ తో పక్కగా బుక్ చేసిన ఫ్యాన్స్..!

Thota Jaya Madhuri
బన్నీ .. బన్నీ.. బన్నీ ఏంటి బన్నీ ఇది..? ఏం చేస్తున్నావ్ బన్నీ..? ఏం మాట్లాడుతున్నావ్ బన్నీ..? అసలు ఎలా మారిపోయావు బన్నీ..? ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో బన్నీను ఓ రేంజ్ లో పొగుడుతూ మరొక రేంజ్ లో వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు . దానంతటికీ కారణం పుష్ప2 సినిమా . పుష్ప సినిమాకి గాను  ఆయన నేషనల్ అవార్డు అందుకున్నాడు.  అప్పటినుంచి మెగా ఫ్యామిలీతో విభేదాలు వచ్చాయి అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది . ఆ తర్వాత పొలిటికల్ పరంగా కూడా వేలు పెట్టడం బన్నీ కొత్త హెడేక్ స్టార్ట్ అయ్యేలా చేసింది . పుష్ప 2  సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్ లో వార్తలు వినిపిస్తున్న పాన్ ఇండియా స్టార్స్ రియాక్ట్ అవుతున్న మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం అందరికీ ప్రశ్నార్ధకంగా ఉంది .


ఈ క్రమంలోనే మెగా వర్సెస్ అల్లు మధ్య వార్ జరుగుతున్న విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసుకున్నారు జనాలు . తాజాగా పుష్ప2 వైల్డ్ ఫైర్ మ్యూజికల్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. బన్నీ చాలా చాలా హుందాగా మాట్లాడారు . స్టేజ్ ఎక్కేటప్పుడు స్టేజ్ కి దండం పెట్టుకొని తానేంటో తన పద్ధతులు ఏంటో ప్రూవ్ చేశాడు . మరీ ముఖ్యంగా చెన్నై గడ్డపై ఆయన స్టెప్స్ వేశాడు.  తమిళంలో మాట్లాడి తన స్పీచ్ తోనే అదరగొట్టాడు . అంతేకాదు రజనీకాంత్ సినిమాల కోసం క్యూలో నిలబడి టిక్కెట్లు కొన్న రోజులను కూడా గుర్తు చేసుకొని అభిమానులను బాగా ఎంటర్టైన్ చేశాడు . చివరిగా స్టేజీపై డాన్స్ చేయమని ఫ్యాన్స్ అడిగినప్పుడు .."నా డాన్స్ చూడాలి అంటే కచ్చితంగా టికెట్ కొనుక్కొని థియేటర్ లోనే చూడాలి అని చెబుతాను .. కానీ ఎందుకో ఫస్ట్ టైం స్టేజిపై డాన్స్ చేయాలనిపిస్తుంది చేస్తున్నాను అంటూ".. చిన్న స్టెప్స్ వేశాడు . దీంతో అక్కడ ఉండే జనాలు ఫుల్ ఖుషి అయిపోయి  అరుపులు కేకలతో బన్ని  పేరుని మారుమ్రోగిపోయేలా చేశారు.


ఇక్కడే బన్నీ ఊహించని చిక్కుల్లో ఇరుకున్నాడు . గతంలో సరైనోడు మూవీ ఈవెంట్ లో డ్యాన్స్ చేశాడు బన్ని.. ఆవిషయాని గుర్తు చేస్తున్నారు జనాలు . అంతేకాదు అప్పుడు ఒక అవార్డ్ ఫంక్షన్ లో కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తో కూడా ఆయన డాన్స్ చేశాడు . అది కూడా ఎవరు అడక్కుండానే ..ఆయనే కోరుకొని మరి డాన్స్ చేశాడు . దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. అలా తన డాన్స్ చెప్పి మరి చేస్తున్నప్పుడు ..చెన్నై ఈవెంట్లో మాత్రం ఎందుకు బన్నీ అలా మాట్లాడాడు ..? అన్నది అర్థం కావడం లేదు . కొంతమంది దీన్ని వెటకారంగా ట్రోల్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం బన్నీ లైఫ్ బన్నీ ది వదిలేయండి రా బాబు అంటున్నారు . బన్నీ చెన్నైలో మాట్లాడిన స్పీచ్ ని మరీ భూతద్దంలో పెట్టుకొని చూడొద్దు అంటూ కూడా సజెషన్స్ ఇస్తున్నారు . మొత్తానికి పుష్ప2 సినిమాతో బన్నీ ఏదో సాధించేలానే ఉన్నాడు అన్నది మాత్రం క్లారిటీగా అర్థమయిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. అసలు సినిమా రిలీజ్ అయితేనే కదా సినిమా హిట్ అయిందో..? ఫట్ అయిందో ..?తెలిసేది . అంతవరకు ఆగండి అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: