డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసే విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..!!
బాదంపప్పు, వాల్నట్స్, పల్లీలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అయితే షాప్స్ లో కెళ్లినప్పుడు ధర తక్కువ ఉన్నట్లైతే... చాలామంది ఒకేసారి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేస్తుంటారు. దీంతో అప్పుడప్పుడు పడయ్యే అవకాశాలు ఉంటాయి. రంధ్రాలు ఏర్పడడం, పురుగులు పడటం లాంటివి జరుగుతాయి. డ్రై ఫ్రూట్స్ పాడవ్వడానికి కారణాలు... ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. డ్రై ఫ్రూట్స్ పాడవ్వడానికి మెయిన్ రీజన్ సరిగ్గా స్టోర్ చెయ్యకపోవటం. గాలి, వెలుతురు చేరి తొందరగా పాడైపోతాయి.
వెలుతురు, గాలి తగలటం కారణంగా అవి ఆక్సీకరణ చెందుతాయి. బొక్కలు పడుతాయి. టేస్ట్ పోతుంది. పిండి పిండిగా మారుతాయి. కాకా గాలి చొరబడని కంటైనర్లు, డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టాలి. ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టాలనుకుంటే ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి మూత సరిగ్గా పెట్టి స్టోర్ చేయవచ్చు. సరిగ్గా నిలువ చేస్తే మాత్రం ఏడాది పాటు నిల్వ ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ కు మసాలా, తేమ, షూటైన స్మెల్ వచ్చేవి దూరంగా ఉంచాలి. అలాగే వీటిని చాలామంది ప్యాకెట్లలో ఉంచుతారు. కానీ తిన్నాక వాటికి క్లిప్స్ పెట్టాలి. దీంతో పాడవకుండా ఉంటాయి. డైరెక్ట్ ఎండ తగ్గిలే ప్లేస్ లల్లో మాత్రం అస్సలు ఉంచకూడదు. సూర్య రశ్శి తక్కువగా ఉన్న కాస్త చీకటిగా ఉన్న దగ్గర పెడితే బెటర్.