చిత్ర పరిశ్రమలో వరుస పెళ్లిబాజాలు... ఎటు చూసినా అదిరిపోయే న్యూస్ లే..!
చిత్ర పరిశ్రమ లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ గట్టి గా నడుస్తుంది .. వచ్చే నెల లో నాగచైతన్య పెళ్లి చేసుకుంటున్నాడు . అలాగే గోవాలో కీర్తి సురేష్ పెళ్లి కి సర్వం సిద్ధమైంది . ఇక కీరవాణి కొడుకు శ్రీ సింహ వెడ్డింగ్ కూడా డిసెంబర్ లోనే జరగనుంది .. ఇప్పుడు ఎటు చూసినా మ్యారేజ్ వార్తలే వినిపిస్తున్నాయి . రీసెంట్ గా టాలీవుడ్ సింగర్ అనురాగ్ కులకర్ణి , రమ్య బెహరా ఈ సీజన్ లో ముందుగా పెళ్లి చేసుకుని ఫస్ట్ జంటగా నిలిచారు .
ఇక వీరి పెళ్లికి వచ్చిన వారి కోసం ఈ జంట పాడిన పాట కూడా ఎంతో వైరల్ అయింది . ఆ తర్వాత వెంటనే శ్రీ సింహ , రాగా ప్రీ వెడ్డింగ్ పిక్స్ కూడా వైరల్ అయ్యాయి . మత్తు వదలరా 2 సినిమా తో రీసెంట్ గా మంచి సక్సెస్ అందుకున్న శ్రీ సింహ .. టాలీవుడ్ దిగ్గజ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగా మాగంటి ని పెళ్లి చేసుకోబోతున్నాడు . అలాగే నాగా చైతన్య , శోభిత దూళిపాళ్ల వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ఇప్పటికే వచ్చేసింది .
డిసెంబర్ 4 న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు . ఇప్పటికే పెళ్లి పనులు కూడా ఎంతో చక్కగా జరుగుతున్నాయి . మరో హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి విషయం మరోసారి తెర మీదకు వచ్చింది ... వచ్చే నెల లో గోవా లో ఈమె పెళ్ళి కి రెడీ అవుతున్నారట ... పెద్దలు కుదించిన వివాహమని వరుడు ఓ పెద్ద బిజినెస్ మాన్ అని కూడా అంటున్నారు . ఇలా ప్రస్తుతం చిత్ర పరిశ్రమ లో ఎటు చూసినా హీరో - హీరోయిన్ల పెళ్లి కి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి .