ఐపీఎల్‌లో ఏ ఆట‌గాడు ఏ టీంలో అంటే..?

frame ఐపీఎల్‌లో ఏ ఆట‌గాడు ఏ టీంలో అంటే..?

praveen
క్రికెట్ క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఐపీఎల్ వేలం విజయవంతంగా ముగియడంతో, ఇక తర్వాత ఘట్టం కోసం నిరీక్షిస్తున్నారు సదరు ఔత్సాహిక ప్రేక్షకులు. ఇక ఐపీఎల్ వేలం విషయమై, తమ అభిమాన ప్లేయర్ అంత తీసుకున్నాడు... ఇంత తీసుకున్నాడు... అనే చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ ఆటగాడు ఏ టీం కి ఆడుతున్నాడో అనే అంశం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. దాంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
దాదాపు 2018 నుండి నేటి వరకు ఆర్ సి బి కి ఆడిన హైదరాబాద్ క్రీడాకారుడు, పేసర్ అయినటువంటి మహమ్మద్ సిరాజ్ రాబోతున్న సీజన్ నుండి గుజరాత్ టైటాన్స్ తరుపున బరిలోకి దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ టీమ్ ఇండియా క్రీడాకారుడి కోసం గుజరాత్ భారీ మొత్తంలో 12.25 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే గుజరాత్ ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం ఇది తొలిసారి ఏమీ కాదు. గతంలో అనేకమార్లు ఇలా భారీ మొత్తంలో వెచ్చించిన సంగతి మీరు వినే ఉంటారు. ఈ క్రమంలోనే గుజరాత్ ఇషాన్ కిషన్ కోసం 11.25 కోట్లు, మహమ్మద్ షమీ కోసం 10 కోట్లు వెచ్చించడం జరిగింది.
ఇకపోతే తాజాగా ముగిసిన ఐపీఎల్ వేలంలో వివిధ రకాల ఫ్రాంచైజీలు కళ్ళు చెదిరే ధరలను వెచ్చించడం జరిగింది. ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడడంతో క్రీడాకారుల పంట పండిందనే చెప్పుకోవాలి. మునిపెన్నడు తీసుకొని విధంగా ప్రస్తుత క్రీడాకారులు ఎక్కువ మొత్తంలో అమ్ముడు పోయారు. ఈ క్రమంలోనే 10 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ తీసుకున్న ఆటగాళ్లు దాదాపు 20 మంది దాకా ఉన్నారంటే అతిశయోక్తిగా ఉంటుంది. కానీ ఇది వాస్తవం. ఈసారి ఆటగాళ్ల పంట పండిందనే చెప్పుకోవాలి. స్టార్ వికెట్ కీపర్ పంత్ అందరికంటే ఎక్కువగా 27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ తీసుకుంటున్న క్రీడాకారుడిగా రికార్డులు సృష్టించాడు. అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ కూడా దాదాపు 23.75 కోట్లకు అమ్ముడుపోయి అందరిని ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా 18 కోట్లతో హర్షదీప్, చాహల్ అందరినీ మైమరపించేలా చేశారు. అయితే ఈసారి చాలా విచిత్రంగా ఓ పాపులర్ ఆటగాడు ని ఫ్రాంచైజీలు అస్సలు పట్టించుకోకపోవడం చాలా ఆసక్తికరంగా మారింది. మొన్నటి స్టార్ దిగ్గజం వార్నర్ గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం వార్నర్ ఫామ్ లో లేకపోవడంతో ఆయనని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఈ క్రమంలో ఆయన రూపాయికి కూడా అమ్ముడు పోవకపోవడం చాలా బాధాకరమైన అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL

సంబంధిత వార్తలు: