నా జీవితాన్నీ మార్చేసిన వ్యక్తి ఆయనే.. అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్..!!

murali krishna
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు అల్లు అర్జున్. మొన్నటి వరకు  టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగిన బన్నీ.. ఇక పుష్ప అనే సినిమాతో వరల్డ్ హిట్ సాదించి గ్లోబల్ హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఎప్పుడూ పుష్పా సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న పార్ట్ 2 లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే పుష్ప సినిమా ద్వారా అటు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా అందుకున్నాడు అల్లు అర్జున్.ఈ అరుదైన అవార్డును అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు తెలుగు ప్రేక్షకులకు స్టైలిష్ స్టార్ గా కొనసాగిన అల్లు అర్జున్ ఇక ఇప్పుడు ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. అయితే ఇక తన కెరీర్ ను నిలబెట్టిన ఒక వ్యక్తికి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా అల్లు అర్జున్ జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పిన వ్యక్తి ఎవరో కాదు సుకుమార్. ఆర్య మూవీతో సుకుమార్, అల్లు అర్జున్ బాండింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.
 ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్స్ యాక్టింగ్ కి మాత్రం మంచి పేరు వచ్చింది అని చెప్పాలి. ఇక ఇటీవల పుష్ప సినిమాతో ఏకంగా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా రేంజ్ హీరోగా మార్చేశాడు సుకుమార్. ఈ నేపథ్యంలో తొలి చిత్రం గంగోత్రి తర్వాత ఏడాది పాటు ఏ ఒక్కరు తనతో కలసి పనిచేసేందుకు రాలేదని ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తెలిపారు.అయితే ఆర్య మూవీ సమయంలో సుకుమార్తో నడవాలని నిర్ణయం తీసుకోవడం వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ అల్లు అర్జున్ పుష్ప 2 స్పెషల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. ఆరోజు వేరే నిర్ణయం తీసుకుని ఉంటే ఈ స్థాయిలో ఉండే వాడిని కాదు అంటూ తెలిపాడు. ఒకానోకు సమయంలో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా వచ్చాను అని భావిస్తే నాకు సుకుమారు కనిపించారు అంటూ బన్నీ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. గుండె మీద చేయి వేసుకొని నేను ఒకే మాట చెప్పగలను. సుకుమార్ లేకపోతే నేను లేను.నేను లైఫ్ లాంగ్ అతనికి రుణపడి ఉంటా అంటూ తన కృతజ్ఞత భావాన్ని చాటుకున్నాడు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: