విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ గురించి చెప్పగానే చాలామందికి ఆయన సృష్టించిన రచ్చ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 64 ఏళ్ల వయసు ఉన్న నరేష్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పర్సనల్ కెరీర్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత విషయంలో నటి పవిత్ర లోకేష్ తో నాలుగో పెళ్లి వార్తలు మూడో భార్య ఉండగానే పవిత్ర లోకేష్ తో ఆయన తిరగడం మీడియాలో సంచలనం సృష్టించాయి.ముఖ్యంగా వీరిద్దరూ ఒకే గదిలో ఉండడం ఇలా ఎన్నో వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇంతకీ నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు.. నాలుగు పెళ్లిళ్ల సంగతి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
నరేష్ పెళ్లిళ్లు:
విజయనిర్మల తనయుడు నరేష్ మొదట సీనియర్ కెమెరామెన్ అయినటువంటి శ్రీను కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి అన్యోన్య బంధానికి నవీన్ విజయ్ కృష్ణ అనే కొడుకు జన్మించాడు. ఈయనే నరేష్ పెద్దకొడుకు. ఆ తర్వాత నరేష్ సీనియర్ రచయిత అయినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలైన రేఖ సుప్రియ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరి అన్యోన్య బంధానికి కూడా ఒక బాబు పుట్టారు. అయితే బాబు పుట్టాక ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక నరేష్ మూడో పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు గత రెండు సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో రచ్చ సృష్టించిన రమ్య రఘుపతి. రమ్య రఘుపతి విజయనిర్మల దగ్గర పనిచేస్తూ ఆమె కొడుకు అయినటువంటి నరేష్ ని ప్రేమలో పడేసింది.అలా వీరిద్దరూ ప్రేమలో పడిన తీరుని మళ్ళీ పెళ్లి సినిమాలో చూపించారు.
నరేష్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి కోరిక తీర్చుకుంది.ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి అని భయపెట్టింది.కానీ వీరి పెళ్లి అయ్యాక ఒక భర్తకి భార్య ఎలా ఉండాలో అలా అస్సలు ఉండలేదు.దాంతో నరేష్ విసిగిపోయాడు. వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక బాబు పుట్టాడు. ఇక బాబుని కేవలం డబ్బు కోసమే ఉపయోగించేది.బాబుని అడ్డుపెట్టుకొని డబ్బు కావాలి అని వేధించేదట. అలా మూడో భార్యతో విసిగిపోతున్న సమయంలోనే సినిమాల్లో చేస్తున్నప్పుడు పవిత్ర లోకేష్ తో నరేష్ కి పరిచయం ఏర్పడింది. ఇక నరేష్ ఎలా అయితే తన మూడో భార్యతో ఇబ్బందులు పడుతున్నాడో పవిత్ర లోకేష్ కూడా తన భర్తతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని ఇద్దరు ఒకరిని ఒకరు మనస్పూర్తిగా అర్థం చేసుకున్నారు.
అలా వీళ్ళిద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశారు.వీరు సహజీవనం చేస్తున్న సమయంలో నరేష్ మూడో భార్య పవిత్ర లోకేష్ భర్త సృష్టించిన గొడవలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ వీరు తమకేమీ పట్టదు అన్నట్లు కలిసే ఉంటున్నారు.అలా 64 ఏళ్ల వయసులో ఉన్న నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేయడం గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ముసలోడికి దసరా పండగ అన్నట్లు 64 ఏళ్ల వయసులో సహజీవనం నాలుగో పెళ్లి ఏంటో అని ఆయనపై ట్రోల్స్ చేశారు. కానీ నరేష్ పవిత్ర లోకేష్ లు మాత్రం సమాజం ఏమనుకుంటుందో తమకేం అవసరం లేదని తమ లైఫ్ తమకు ముఖ్యం అని కలిసిమెలిసి ఉంటున్నారు.