వాళ్లని ఎర్రి "పుష్పా"లను చేసిన ఉపాసన.. మెగా కొడలు దెబ్బ అదుర్స్..!
అయితే దీనిపై ఉపాసన చాలా తెలివిగా స్పందించింది. తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది . తన ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫోటోను షేర్ చేస్తూ భారతీయ సంస్కృతిలో అన్ని మతాల గౌరవాన్ని ప్రాధాన్యత ఉంది అని స్పష్టం చేశారు. " విశ్వాసం మనలను కలిపే పద్ధతులలో ఒకటి ..అది అందరికీ ఒకటే.. భారతీయులుగా మతానికి సంబంధించిన ప్రతి విధానాన్ని గౌరవించాలి ఆచరించాలి ఐక్యతలోనే అసలైన బలం ఉంది . రామ్ చరణ్ ఎప్పుడు కూడా తన సొంత విశ్వాసాలను గౌరవిస్తూనే ఉంటారు. ఇతర మతాల పట్ల కూడా ఆ ఆదరణ చూపుతూ ఉంటారు" అనే విధం గా ఉపాసన రాసుకొచ్చింది.
ఇదే క్రమంలో ఒక నెటిజెన్ ఉపాసనాకి కౌంటర్ వేస్తూ ప్రశ్న వేశారు. " ఇతర మతాలను గౌరవించడం అంటే అయ్యప్ప మాలతో దర్గాను సందర్శించడం కాదు.." అనే విధంగా ఫైర్ అయ్యాడు. దీనికి ఉపాసన చాలా చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. టైప్స్ ఆఫ్ ఇండియా లో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేస్తూ .."శబరిమలకు వెళ్లే భక్తులు మసీదులో ప్రార్థన చేసే సంప్రదాయం గురించి పోస్ట్ చేసింది". దీనితో సోషల్ మీడియాలో ఉపాసన పేరు మారుమ్రోగిపోతుంది. ఎవరైతే మతాలను హైలెట్ చేస్తూ మాట్లాడుతూ స్టార్స్ ని నెట్టింట ట్రోల్ చేస్తూ ఉంటారో వాళ్ళని పక్కాగా ఎర్రి పుష్పాలను చేసేసింది మా ఉపాసన మేడం అంటూ మెగా ఫ్యాన్స్ ఉపాసన పోస్టును ట్రెండ్ చేస్తున్నారు . మెగా కోడలు దెబ్బ అలానే ఉంటుంది . లాగి పెట్టి కొట్టదు కానీ కొట్టడం కన్నా కూడా ఎక్కువ రేంజ్ లో రీ సౌండ్ వస్తుంది అంటూ ఉపాసనని ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు..!