హీరోతో నయన్ ఎఫైర్...రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న నాగార్జున ?
ఈ డాక్యుమెంటరీ విషయంలో సౌత్ సూపర్ స్టార్ ధనుష్ నయనతారపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నానుమ్ రౌడీ ధాన్ సినిమాలో సీన్స్ ను వాడుకోవడంతో నయనతారకు ధనుష్ లీగల్ నోటీసులు కూడా పంపించారు. డాక్యుమెంటరీలో తాజాగా అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ తరుణంలోనే నాగార్జున నయనతార గురించిన ఓ వార్త తెలుగులోకి వచ్చింది. తెలుగు సినిమా బాస్ లో నాగార్జున సరసన హీరోయిన్గా నయనతార చేసింది. డాక్యుమెంటరీలో నాగార్జున నయనతారతో ఉన్న అనుభవాలను గురించి మాట్లాడారు.
ఆ సినిమా సమయంలో నయనతార మరొక నటుడితో రిలేషన్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్టుగా నాగార్జున గుర్తు చేసుకున్నాడు. నయనతార డేటింగ్ లో ఉన్న ఆ నటుడి పేరు, వివరాలు వెల్లడించినప్పటికీ వారి రిలేషన్ 'కల్లోలం' అని వెల్లడించారు. నాగార్జున మాట్లాడుతూ.... స్విట్జర్లాండ్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో నయనతార తన రిలేషన్ లో చాలా సమస్యలు ఎదుర్కొంది.
ఆమె ఫోన్ వస్తే చాలు మేమంతా చాలా భయపడే వాళ్ళం. తను ఫోన్ మోగితే చాలు తన మానసిక స్థితి కోల్పోయేది. నేను ఆమెతో రిలేషన్ గురించి మాట్లాడినట్లు కూడా నాకు గుర్తుంది. నీ జీవితాన్ని ఎందుకు ఇలా చేసుకుంటున్నావు. నువ్వు చాలా మంచి విజయాలు సాధించిన మహిళవు అని నేను చెప్పానంటూ నాగార్జున వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారుతుంది.