ఒక్క మూవీకి దీపిక ఎంత తీసుకుంటుందో తెలుసా.. ఇండియాలోనే టాప్..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా ఇప్పటికీ కూడా హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో దీపిక ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఈ బ్యూటీ పాత్రకు మంచి ప్రశంసలు రావడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు లో కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఇండియాలో ఉన్న నటీమణులలో అత్యంత భారీ పారితోషకం తీసుకొని నటీమణులలో మొదటి స్థానంలో ఈ బ్యూటీ ఉంటుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ నటి ఒక్కో సినిమాకు దాదాపు 15 నుండి 30 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ముద్దు గుమ్మ కథను బట్టి , దర్శకుడు ని , బట్టి నిర్మాతను బట్టి తన పారితోషకంలో మార్పులు , చేర్పులు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ పోయిన సంవత్సరం షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన పటాన్  జవాన్ రెండు సినిమాలలో కూడా హీరోయిన్గా నటించింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: