తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ పెద్ద ఎత్తున సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేర్లలో బాబు మోహన్ పేరు కూడా ఒకటి అని చెప్పాలి. ఎన్నో సినిమాలలో తన నటనతో అందరినీ మెప్పించినటువంటి ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలో కూడా పనిచేస్తూ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు.ఈ విధంగా నటుడిగా, మంత్రిగా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోనూ కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తెరపై ఎంతో మందిని నవ్విస్తూ కనిపించారు. కానీ తెర వెనక మాత్రం తన జీవితంలో ఎక్కువ విషాదాలే చోటు చేసుకున్నాయని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బాబు మోహన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన కుమారుడి మరణం గురించి మాట్లాడుతూ ఈయన ఎమోషనల్ అయ్యారు.ఎంతో ముద్దుగా ప్రేమగా పెంచుకున్నటువంటి తన కుమారుడు 2009వ సంవత్సరంలో మరణించారు. ఇలా తన కుమారుడు మరణించడంతో తనకు ఏం దిక్కుతోచలేదని తన కుమారుడి మరణ వార్త నుంచి తాను బయటపడలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు. కొడుకు మరణం తల్చుకుంటూ బ్రతకలేక తాను కూడా చనిపోవాలని డిసైడ్ అయ్యాను అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కాంబినేషన్‌కు తిరుగులేదు. తెరపై వీళ్లిద్దరు కనిపిస్తే ఆడియన్స్‌కు కితకితలే. మొత్తంగా వెండితెరపై తమ జోడికి తిరుగులేదనిపించారు. ఇక వీళ్లిద్దరు కుమారులు కూడా యాదృచ్ఛికంగా యాక్సిడెంట్లో కన్నుమూయడం విషాదకరం.ఈ సందర్భంగా బాబు మోహన్,కోట శ్రీనివాసరావు, తమ జీవితంలోని విషాదాల గురించి చెబుతూ, ఇద్దరి జీవితాల్లో ఒకేలా ఘటనలు చోటు చేసుకున్నాయని, తన పెద్ద బాబుపవన్ కుమార్ బైక్‌పై వెళ్తుంటే చిన్నబాబు కారులో వెనకాలే ఉన్నాడని, అలాగే కోట కొడుకు బైక్‌పై వెళ్తుంటే వారి ఫ్యామిలీ వెనకాలే ఉందని, వాళ్ల కళ్ల ముందే ఈ దుర్ఘటలు చోటు చేసుకున్నాయని తెలిపారు. తమ ఇద్దరి ఇళ్లు పక్క పక్కనే అని, ఈ ఘటనలు కూడా తమ ఇంట్లోనే జరిగాయన్నారు. మా ఇద్దరికి కడుపు కోత ఇంకా మర్చిపోలేని దారుణం, కరుడు గట్టిన చర్యగా అభివర్ణించారు బాబు మోహన్. నవ్వించడం మేం చేసిన పాపమా? మేం లక్షలాది, కోట్లాది మందిని నవ్వించినందుకు ఇంత నవ్విస్తార్రా అని ఆ దేవుడు మాకు వేసిన శిక్షణేమో, అంటూ ఎమోషనల్ అయ్యారు బాబు మోహన్.ఈ క్రమంలో బాబూమోహన్ తన కొడుకు మరణం తట్టుకోలేక కోటశ్రీనివాసరావుని హత్తుకొని అన్న నా చెట్టంత కొడుకు పోయాడే అంటూ ఏడవడం అందరిని కన్నీరుపెట్టించింది.