టాలీవుడ్‌లోనే సంపన్నుడు.. ప్రభాస్ ఆస్తులు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే?
ప్రస్తుతం ప్రభాస్ ఒక్క సినిమాకి 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ప్రభాస్ నటించిన సినిమాలు సుమారు రూ.3,000 నుంచి రూ.4000 కోట్ల వరకు వసూలు చేస్తాయి. ఇది ఆయన స్టార్‌డమ్‌ను తెలియజేస్తుంది. ప్రభాస్ క్షత్రియ కుటుంబానికి చెందిన వాడు బాగా సంపన్న కుటుంబంలో జన్మించాడు. వారి వద్ద వేల ఎకరాల భూమి ఉంది. ఈ భూములు వారి కుటుంబానికి ఎన్నో తరాలుగా వస్తున్నాయి. ప్రభాస్ తండ్రి సత్యనారాయణ రాజు తన తమ్ముడు కృష్ణంరాజుతో కలిసి 'గోపీకృష్ణ మూవీస్' బ్యానర్‌పై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించారు. సినిమాలతో పాటు సత్యనారాయణ రాజు విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. వారి కుటుంబం గ్రానైట్ ఫ్యాక్టరీని కలిగి ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఫామ్‌హౌస్‌లు, థియేటర్లు వంటి అనేక ఆస్తులు వారి వద్ద ఉన్నాయి.
భూమి విషయానికి వస్తే, ప్రభాస్ కుటుంబం వద్ద వందల ఎకరాల వ్యవసాయ భూమి, కొబ్బరి తోటలు ఉన్నాయి. హైదరాబాద్ శివార్లలో అడవి భూమితో పాటు సొంతూరు అనే ప్రదేశంలో మరిన్ని ఆస్తులు వారి వద్ద ఉన్నాయి. కృష్ణంరాజుకు కుమారులు లేకపోవడంతో ప్రభాస్ కుటుంబపు భారీ ఆస్తికి ప్రధాన వారసుడుగా పరిగణించబడుతున్నాడు. ఈ ఆస్తులను నిర్వహించే బాధ్యతను ఆయన స్వీకరించాడు
ప్రభాస్ కేవలం నటనలోనే కాకుండా, ఖరీదైన కార్ల కలెక్షన్‌తో కూడా అందరి కంటే ముందుంటాడు. లంబోర్ఘిని అవెంటడోర్ రోడ్‌స్టర్, ఒక రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఒక ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, ఒక జాగ్వార్ XJ, ఒక bmw X3, వంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజ్‌లో ఉన్నాయి. ఈ కార్ల మొత్తం విలువ సుమారు 10 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సమీపంలో భారీ ఫామ్‌హౌస్ నిర్మిస్తున్నారు. మొత్తం మీద ప్రభాస్ ఆస్తుల విలువ 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. ఇంత భారీ ఆస్తితో ప్రభాస్ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ధనవంతులైన నటులలో ఒకరుగా నిలిచారు.