"అలాంటి గబ్బు ఫ్యామిలీ కాదులేండి".. హిట్ పెంచేస్తున్న వరుణ్ తేజ్ హాట్ కామెంట్స్..!

Thota Jaya Madhuri
వరుణ్ తేజ్ తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన చేసిన కొన్ని కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రాద్ధంతంగా మారిపోతున్నాయి . మరీ ముఖ్యంగా ఆయన ఎంతో కష్ట పడి ఇష్టంగా  నటించిన మట్కా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ పరోక్షకంగా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు వరుణ్ . అంతేకాదు వరుణ్ తేజ్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అదే రోజులో ఘాటుగా కూడా కౌంటర్స్ వేశారు . కాగా ఇదే క్రమంలో మట్కా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు వరుణ్ తేజ్ . ఈ క్రమంలోనే ఒకానొక ఇంటర్వ్యూలో ఆయన భార్య లావణ్య త్రిపాఠి పై ప్రశ్నలు ఎదురయ్యాయి . చాలా ధైర్యంగా చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చాడు వరుణ్ తేజ్ .


లావణ్య త్రిపాఠి మెగా ఇంటికోడలు అయ్యాక ఎందుకు సినిమాలో నటించడం లేదు..? మెగా ఫ్యామిలీ ఏమైనా లావణ్య కి కండిషన్ పెట్టిందా..? ఇక మళ్ళీ మేము తెరపై లావణ్యని హీరోయిన్గా చూడొచ్చా..? అంటూ పలు విధాలుగా ప్రశ్నించారు హోస్ట్ . ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ సైతం చాలా ఓపెన్ గా స్పందించారు . చాలా ఓపెన్ గా క్లారిటీ ఇచ్చారు . "సినిమాలు చేయడానికి ఆమె రెడీగా ఉంది . అయితే గతంలో వచ్చిన సినిమాలు ఇప్పుడు ఆమె నటించబోయే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటున్నాను.. ఒకప్పుడు పాత్రకి ప్రయారిటీ ఉన్నా లేకపోయినా చేసుకుంటూ వచ్చేసింది . ఆ జర్నీ చాలా డిఫరెంట్. కానీ ఇప్పుడు ఆమెకు అవసరమే లేదు "..


"ప్రస్తుతం తను కంఫర్టబుల్ ప్లేస్ లో ఉంది . ఇప్పుడు ఏది పడితే అది చేయాల్సిన అవసరం తనకి లేదు . ప్రస్తుతం కధలు వింటుంది . కచ్చితంగా మంచి సినిమా వస్తే ఆమె నటిస్తుంది . పెళ్లి తర్వాత నటించకూడదు అనే కండిషన్ ఏమీ లేవు . ఆ మైండ్ సెట్ నుంచి ఎప్పుడో అందరు బయటికి వచ్చేసారు" అంటూ చెప్పుకు వచ్చాడు వరుణ్ తేజ్. కాగా వరుణ్ తేజ్ పరోక్షంగానే ఓ స్టార్ ఫామిలీ ని టార్గెట్ చేసినట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీకి సంబంధించిన హీరో..ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమాలో నటించింది . వెంటనే ఆమెకు డివర్స్ ఇచ్చేశారు . ఇదే విషయాన్ని పరోక్షంగా లేవదీశాడు వరుణ్ తేజ్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: