సూర్యపై పుష్ప2 ప్రతీకారం..కంగువాకు భారీ నష్టం ?

Veldandi Saikiran

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కంగువా. ఈ సినిమా సూర్య కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. ఈ సినిమాకి రూ. 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో కంగువా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించారు. కంగువా తొలి తమిళ పాన్ ఇండియా సినిమాగా రూపొందించడం విశేషం. ఈ సినిమాతో సూర్య రూ. 1000 కోట్ల మార్క్ తో  మార్కెట్ లోకి చేరతారని ప్రచారం జరుగుతుంది. ఇందులో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ నిర్మాణంలో కంగువా సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది. మైత్రి అంటే ఏపీ, తెలంగాణలో భారీగా థియేటర్లు దొరుకుతాయని ఆశిస్తారు. అయితే కంగువా సినిమాకు అనుకున్నంత స్థాయిలో థియేటర్లు లేవు.

దానికి కారణం మైత్రి సంస్థ పెట్టిన ఫిట్టింగ్. సాధారణంగా సింగిల్ స్క్రీన్ లో షేరింగ్ పద్ధతిలో థియేటర్లు తీసుకుంటుంటారు. కానీ ఈ సినిమా మాత్రం రెంటల్ పద్ధతిలో థియేటర్లు ఇవ్వాలని మైత్రి సంస్థ నిర్ణయించింది. దాంతో ఏసీఎస్ సినిమాస్.... తమ థియేటర్లు కంగువాకు ఇవ్వడానికి నిరాకరించింది. ఏఎంబి, మల్టీప్లెక్స్ లో సైతం కంగువా సినిమాకు స్క్రీన్లు దొరకడం లేదు. షేరింగ్ పద్ధతిలో అయితేనే స్క్రీన్లు ఇస్తామని ఏషియన్ ఖరాఖండీగా చెప్పింది.

దాంతో మిగిలిన థియేటర్లు కూడా కంగువాను ఆడించడానికి సిద్ధంగా లేవు. మైత్రి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం పుష్ప 2. డిసెంబర్ 5న పుష్ప 2 సినిమ రాబోతుంది. పుష్ప 2కు కూడా ఇలానే షేరింగ్ పద్ధతిలో థియేటర్లు ఇస్తే, మైత్రి సంస్థ భారీగా నష్టపోతుంది. అందుకే ముందుగానే కంగువా సినిమాతో థియేటర్లు అన్నింటిని ఓ దారిలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: