ఏపీ: తిరుమలలో మద్యం, మాంసం కలకలం.. ఏం జరిగిందంటే..?
చిన్న తిరుపతిగా పీల్చుకునేటువంటి ద్వారకాతిరుమల ఆలయం వెనుక వైపున మద్యం బాటిల్లు, మద్యం సేవించినటువంటి ఆనవాళ్లు మాంసం తిన్నటువంటి ఆనవాళ్లు కనిపించడంతో తిరుమలలో ఒక్కసారిగా ఈ విషయం నిన్నటి రోజు నుంచి ఒక రచ్చ చేస్తోంది .ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ తర్వాత పోలీసులు సైతం అక్కడ వెళ్లి వెరిఫై చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే.. టూరిస్ట్ బస్సులో యాత్రికులను తీసుకువచ్చిన తర్వాత ఆ యాత్రికులు దర్శనానికి వెళ్లి వచ్చిన తర్వాత డ్రైవరు ఆ సిబ్బంది అంతా కూడా కలిసి కూర్చొని మద్యం సేవించారు మాంసం తిన్నటువంటి అంశం గుర్తించారట.
వాస్తవానికి కొండపైన ఇలాంటివన్నీ కూడా నిషేధం ఉంటుంది.. అయితే ఆ విషయం తమకు తెలియదని ఆ టూరిస్టులు చెప్పడంతో టూరిస్ట్ డ్రైవర్కి ,సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చి మరి పంపించారు పోలీస్ అధికారులు.. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని.. వారికి తెలియక జరిగింది అన్నటువంటి విషయాన్ని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటివి మరొకసారి తిరుపతిలో జరగకుండా చూసుకోవడానికి పలు రకాల చర్యలు కూడా తీసుకుంటామని ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి నిన్నటి నుంచి వైరల్ గా మారిన ఈ విషయం పైన అధికారులు క్లారిటీ ఇవ్వడం జరిగింది.