వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు... దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మేలు..!
మై గ్రాండ్ లేదా తలనొప్పి ఉన్నప్పుడు బాదం తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. మైకం వికారం వాంతులు లాంటివి వస్తాయనేది నిపుణులు చెబుతున్నారు. హై బీపీ ఉన్నవారు కూడా ఎక్కువగా తినవద్దు. ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది రక్తపోటును మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకవేళ తినాలనుకుంటే వైద్యుల సలహాతో పరిమితంగా తినొచ్చు. కిడ్ని స్టాన్స్ ఉన్నవారు కూడా బాదం పప్పులు తినటం మంచిది కాదు. వీటిలో ఆక్సలేట్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోకి చేరితే కాలుష్యం పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడతాయి.
అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వీటిని తింటే అప్పటికే రాళ్లు ఉండే వాటి పరిమాణం పెరిగే అవకాశం లేకపోలేదు. ఈరోజుల్లో చాలామంది అజీర్తి కడుపు నొప్పి ఉబ్బరం గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్లు బాగా ఎక్కువగా తినకూడదు. బాదంపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కడుపునొప్పి గ్యాస్ సమస్యలు మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంది. అధిక బరువు లేదా ఊబకాయ సమస్యతో బాధపడేవారు సైతం బాదం పప్పుల జోలికి పోకూడదు. బాదం పప్పులు క్యాలరీలు సంతృప్తి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.