హైదరాబాద్ లోనే ఉండాలనే కోరిక.. ఆ దర్శకుడికి ప్రేమించిన భార్యను దూరం చేసింది?
అయితే ఇలా ప్రేమ వివాహాలు చేసుకున్న దర్శకుల లిస్టులో కొనసాగుతున్నాడు కోవెలమూడి సూర్యప్రకాష్. ఈయన ఎవరో కాదు కే రాఘవేంద్రరావు కుమారుడు. సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు కుమారుడు కోవెలమూడి సూర్యప్రకాష్ చాలా ఏళ్ల పాటు తన తండ్రి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. అనంతరం ముంబైలో కొందరు సీనియర్ డైరెక్టర్ల దగ్గర సహాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ, శృతిహాసన్ జంటగా మంచు లక్ష్మి విలన్ పాత్రలో తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత అనుష్కతో ఓ సినిమా కూడా తెరకెక్కించారు. అదే సైజ్ జీరో. ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత ముంబైలో పని చేస్తున్న సమయంలో షారుక్ ఖాన్ కు చెందిన సంస్థలు సహాయ దర్శకురారుగా క్రియేటివ్ హెడ్‌గా పని చేస్తున్న కనిక తెల్లంతో ప్రేమలో పడ్డారు సూర్య ప్రకాష్.
ఒకానొక సమయంలో కనుక కు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు హాస్పిటల్లోనే ఉండి సపర్యలు చేసి ఆమె మనసు గెలుచుకున్నారు. అలా వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అయితే ముంబైలోనే ఉండాలని కనిక పట్టు పట్టగా.. కుదరదు హైదరాబాదులోనే ఉండాలని సూర్య ప్రకాష్ బలంగా కోరుకున్నారు. అలా ఇద్దరి మధ్య మనస్పర్దలు మొదలయ్యాయి. ఇవి కాస్త విడాకుల వరకు వెళ్ళింది. పెళ్లైన కొన్నేళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.