మారుతి : లవ్ స్టోరీ తెలుసా.. లవ్ సక్సెస్ కోసం ఇన్ని కష్టాలా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మారుతి ఒకరు . ఈయన ఈ రోజుల్లో అనే సినిమాతో దర్శకుడుగా కెరియర్లు మొదలు పెట్టాడు . ఇకపోతే ఈ సినిమాను మారుతి అత్యంత తక్కువ బడ్జెట్లో రూపొందించాడు . చాలా చిన్న సినిమా కావడం , ఈ మూవీ లో చెప్పుకోదగ్గ నటీనటులు లేక పోవడం , అలాగే ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లలో ఎవరికి గొప్ప గుర్తింపు లేక పోవడంతో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ల ను విడుదల అయింది.

ఇక థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. దానితో దర్శకుడిగా మారుతి కి సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఈయన దర్శకత్వం వహించిన అనేక సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ప్రస్తుతం మారుతి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడుగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ అనే భారీ బడ్జెట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే మారుతీ ది ప్రేమ వివాహం. మారుతి చాలా సంవత్సరాల క్రితమే స్పందన అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

మారుతి మరియు స్పందనది ఒకే స్కూల్.  ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో భాగంగా స్పందన తమ ప్రేమ కథ గురించి చెప్పుకొచ్చింది. స్పందన ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... నన్ను కలవడానికి మారుతి బస్సులో వస్తే నేను స్కూటీపై వెళ్లే దానిని. ఇద్దరం దొంగతనంగా స్కూటీ పై తిరిగేవాళ్లం. ఇక లైఫ్ లో సెటిల్ అయ్యాక మారుతి పెద్దలని ఒప్పించాడు. ఆ తర్వాత మా పెళ్లి అయ్యింది అని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: