అదే జరిగితే సమంత పేరు మళ్ళీ మారుమ్రోగిపోవాల్సిందే .. సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసే ప్లాన్..!
కానీ ఇప్పుడు సమంత తీసుకున్న నిర్ణయం మాత్రం తన పేరు మళ్లీ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయే విధంగా ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో తెరపై కొన్ని కొన్ని జంటలు చాలా చాలా బాగా పాపులారిటీ సంపాదించుకుంటాయి . గతంలో చిరంజీవి - సౌందర్య ..ఎన్టీఆర్ - శ్రీదేవి ..జూనియర్ ఎన్టీఆర్ - గజాల ఇలా చాలామంది మంచి మంచి కామెంట్స్ దక్కించుకున్నారు. వాళ్లలో ఒకరే సమంత - విజయ్ దళపతి కూడా . ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెరపై వీళ్లు కనిపిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టే . వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.
కాగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా రాబోతున్నట్లు కోలివుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ వీళ్లు జత కట్టబోతున్నారట . విజయ్ తన 69వ చిత్రంలో సమంతకు ఛాన్స్ ఇచ్చాడట . ఆల్రెడీ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది . ఇప్పుడు ఈ సినిమాలో సమంత కూడా ఓ పాత్ర కోసం తీసుకున్నారట మేకర్స్ . ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ కోలీవుడ్ మీడియాలో మాత్రం బాగా ఈ వార్త ట్రెండ్ అవుతుంది . తెలుగులో రాంచరణ్ తో రంగస్థలం 2 సినిమాకి ఓకే చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది . అదేవిధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ దళపతితో జతకట్టబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది . ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం ఇక సమంత బ్యాక్ స్టెప్ వేయాల్సిన పని ఉండదు. కచ్చితంగా రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. తద్వారా ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది అంటున్నారు జనాలు..!