చిరంజీవి కోసం చేసిన సోనాలి బింద్రే పెద్ద రిస్క్.. పైగా మూడు నెలల గర్భవతి అట..!!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నే సినిమాలు చేసినా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అందాల తార సోనాలి బింద్రే. ఈ మహారాష్ట్ర భామ 19 ఏళ్ళకే హీరోయిన్‌ అయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్ సినిమాతో చాలా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో సోనాలీ లాంటి నాజుకు సుందరి ఎవరూ లేకపోవడంతో ఆమె ఒక ఊపు ఊపేసింది. ఈ ముద్దుగుమ్మ మంచి హైట్ కూడా ఉంటుంది. హిందీలో ఫస్ట్ సినిమా చేశాక ఆమెకు వరుసగా ఎన్నో ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఆరు సినిమాలకు చక చకా సంతకం పెట్టేసింది. 1995 సోనాలి కెరీర్‌లో చెప్పుకోదగిన సంవత్సరం. ఎందుకంటే ఈ ఏడాదిలోనే ఆమె నటించిన ది డాన్ , గద్దర్, టక్కర్‌ సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. అదే ఏడాది బొంబాయి మూవీలో "హమ్మా హమ్మా " పాటలో మెరిసింది ఈ తార. ఆ పాట సూపర్ హిట్ అయింది. దాంతో ఈ ముద్దుగుమ్మ ఇండియా వైడ్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
తర్వాత రెండేళ్లపాటుకు ఆమెకు భారీ ఎత్తున అవకాశాలు వచ్చాయి. ఊరిపి కూడా సలపనివ్వని రీతిలో ఆమెను సినిమాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. 1996లో సోనాలీ నటించిన 5 సినిమాలు విడుదలయ్య అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. అందులో రక్షక్, ఇంగ్లీష్ బాబు దేశీ మేమ్, అప్నే దామ్ పర్, సపూత్, దిల్జాలే ఉన్నాయి. వీటి తరువాత సునీల్ శెట్టి హీరోగా వచ్చిన భాయ్, అక్షయ్ కుమార్‌ హీరోగా నటించిన  తారాజు.. సన్నీ డియోల్‌ ప్రధాన పాత్ర చేసిన కహర్ సినిమాల్లో నటించి అక్కడ చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఆరేళ్లపాటు ఆమెకు పోటీ లేకుండా అయిపోయింది.
ఈ అమ్మడు అలా క్రేజ్ తెచ్చుకోవడంతో మిగతా భాషల వారు కూడా తమ సినిమాల్లో ఆమెను తీసుకోవడానికి చాలా ప్రయత్నించారు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించింది. ఆ సమయంలో మురారి సినిమాలో అవకాశం రావడంతో వెంటనే సైన్ చేసింది. మహేశ్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమాలో సోనాలి బాగా హైలెట్ అయింది. వారిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. తర్వాత ఇంద్ర, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్, మన్మధుడు సినిమాలతో తెలుగువారిని మరింత అలరించింది. విశేషమేంటంటే సోనాలి నటించిన తెలుగు సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
అయితే, సోనాలి శంకర్ దాదా సినిమా కోసం చాలా పెద్ద సాహసమే చేసింది. అసలు ఏం జరిగిందంటే, ఈ సినిమా రిలీజ్‌ అయ్యాక ఇంకో పాటను కొత్తగా యాడ్ చేయాలని చిత్ర బృందం భావించింది. ఈ పాట కోసం మూడు రోజులు సోనాలి షూటింగ్‌లో పాల్గొనాలంటూ రిక్వెస్ట్ చేశారు మేకర్స్. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, అప్పటికే ఆమె 3 నెలల గర్భవతి. మేకర్స్‌కి ఈ విషయం తర్వాత తెలిసింది. కానీ అప్పటికే ఆమె మేకర్స్ అడిగిన వెంటనే సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆమె గర్భవతి అనే విషయం తెలియడం వల్ల మూవీ టీమ్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి ఈ పాట షూటింగ్ కంప్లీట్ చేశారు. సోనాలికి చాలా సింపుల్ స్టెప్స్ ఇవ్వడంతో ఆమె కడుపులోని బిడ్డ పై పెద్దగా ప్రెషర్ పడలేదు. ఆమె కూడా సంతోషించి ఈ చిన్న చిన్న స్టెప్పులు వేసింది. అలా చిరు కోసం పెద్ద రిస్క్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: