భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఒకరు. నటనకే కొత్త భాష్యం చెప్పిన ఈ విలక్షణ నటుడు ద ర్శకుడి గా, నిర్మాత గా, రైటర్ గా భారతీయ చిత్ర పరిశ్రమ పై చెరగని ముద్ర వేశారు. దాదాపు ఆరు దశాబ్ధాలు గా తన నటన తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఇదిలావుండగా కమల్ హాసన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇకపై తనను ఎలాంటి స్టార్ ట్యాగ్స్‌తో పిలవవద్దని, కేవలం కమల్ లేదా కమల్ హాసన్ అని మాత్రమే పిలవాలని ఆయన నిర్ణయించారు.తనకు మరెన్నో అద్భుతమైన చిత్రాలు అందించాలనే ఉద్దేశం తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన ఈ విషయాన్ని సోమవారం ఎక్స్ వేదికపై పోస్ట్ చేసి వెల్లడించారు.నా నటనని మెచ్చి ఉలగనాయగన్ వంటి ఎన్నో బిరుదులను అందించినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. ప్రేక్షకులు, తోటి నటీనటులు, ఆత్మీయుల నుంచి వచ్చే ఇలాంటి ప్రశంసలు నా మనసుని తాకాయి.కళ కంటే కళాకారుడు గొప్ప కాదని నా నమ్మకం. నా లోపాలను గుర్తించి, వాటిని మెరుగుపరుస్తూ నటుడిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రయత్నిస్తాను. ఆలోచించి, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇకపై స్టార్‌ట్యాగ్స్‌ను మర్యాదపూర్వకం గా తిరస్కరిస్తాను. నా అభిమానులు, మీడియా, సినీ ప్రముఖులు, భారతీయులందరూ నన్ను కేవలం కమల్ హాసన్ లేదా కమల్ లేదా కె.హెచ్.అని పిలవాలని అభ్యర్థిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా మీరు చూపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. నా మూలాలకు నేను కట్టుబడి, నటుడిగా నా బాధ్యతను నిర్వహించాలని ఆశిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆయన అన్నారు.ఇదిలావుండగా ఆరు దశాబ్ధాల కెరీర్‌లో 230కి సినిమా ల్లో నటించిన కమల్ హాసన్‌కు ఎన్నో జాతీయ , అంతర్జాతీయ అవార్డులు వరించాయి. తనను ఇంతటి వాడిని చేసిన ప్రజలకు సేవ చేయలేనే ఉద్దేశంతో రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు.