సూర్యవంశం: డ్యూయల్ రోల్ లో తన మార్క్ చూపించి 'విక్టరీ'గా నిల్చిన వెంకీ.!

FARMANULLA SHAIK
విక్టరీ వెంకటేష్‌ టాలీవుడ్‌లో వివాదాల కు దూరంగా వుండే ఏకైక హీరో.ఆయన తన సినిమాలు, తన ఫ్యామిలీ, తన ఆథ్యాత్మిక చింతనతో ఉంటారు. మిగిలిన ఏ విషయాలను పట్టించుకోరు. బయట సినిమా ఈవెంట్లలోనూ కనిపించేది తక్కువే. చాలా అరుదుగా గెస్ట్ గా వస్తూ సందడి చేస్తుంటారు. టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన హీరోగా పేరుతెచ్చుకున్నారు వెంకీ. మంచి ఫ్యామిలీ సెంటిమెంట్స్ కి, ఎమోషన్స్ కి ఆయన పెట్టింది పేరు. ఎన్నోసెంట్‌ రోల్స్ లో వెంకీ నటన వేరే లెవల్‌. అదే సమయంలో కామెడీని పంచడంలోనూ ఆయన మరో లెవల్.తన కెరీర్‌లో వెంకీ చేసింది  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే ఎక్కువ కావడం విశేషం.వెంకటేష్ సినిమాలు అటు లవ్‌ స్టోరీ విషయంలోనూ, ఇటు ఫ్యామిలీ ఎలిమెంట్ల పరంగానూ సమపాళ్లతో ఉంటూ అలరించాయి. టాలీవుడ్‌ని ఊపేశాయి.అలాంటి ఫ్యామిలీ సినిమాలలో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన సూర్యవంశం ఒకటి.సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి తను నిర్మించగా.. తమిళనాట ఘన విజయం సాధించిన చిత్రాలను తెలుగులో స్టార్ హీరోలతో తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు. పవన్ కళ్యాణ్ సుస్వాగతం తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా సూర్యవంశం చేశారు.రీమేక్స్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాస రావు డైరెక్టర్.1998 ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదలైంది.తమిళంలో శరత్ కుమార్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా విక్రమన్ డైరెక్ట్ చేసిన సూర్యవంశం సూపర్ డూపర్ హిట్ అయింది.

తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేశారు.విక్టరీ వెంకటేష్ ద్విపాత్రాభినయం చేయగా రాధిక, మీనా,సంఘవి, ఆనంద్ రాజ్, మాస్టర్ ఆనంద్ వర్థన్ తదితరులు నటించారు.తమిళ వెర్షన్‌కి సంగీతమందించిన ఎస్.ఎ.రాజ్ కుమార్ తెలుగుకి కూడా మ్యూజిక్ ఇచ్చారు.
కైకాల, సుధాకర్, కోట, ఆలీ, మహర్షి రాఘవ, వినోద్ ఇతర పాత్రల్లో నటించారు. కథ ఇది అని కొత్తగా చెప్పక్కర్లేదు.రిపీట్ ఆడియన్స్‌ని థియేటర్లకి తీసుకొచ్చిన సినిమా సూర్యవంశం, హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ అనే తండ్రీ కొడుకుల పాత్రల్లో వెంకటేష్ నటన ఆకట్టుకుంటుంది.రాధిక, మీనా పాత్రలు మహిళలకు బాగా నచ్చాయి.ముఖ్యంగా కథ, క్యారెక్టర్లు, వాటి తాలూకు ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.పాటలైతే ఇప్పటికీ ఎవర్ గ్రీనే.రోజావే చిన్ని రోజావే, కిల కిల నవ్వే కోయిల కోసం,అడుగో మహరాజువంటి సాంగ్స్ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.హిందీలో అమితాబ్ బచ్చన్, సౌందర్య, జయప్రద తారాగణంగా.ఈవీవీ సత్య నారాయణ దర్శకుడిగా సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయా కంబైన్స్ బ్యానర్ మీద ఆయన సోదరుడు జి. ఆదిశేష గిరి రావు నిర్మాతగా రీమేక్ చేయగా అక్కడ కూడా విజయం సాధించింది.అలాగే కన్నడలో సూపర్ స్టార్ విష్ణు వర్థన్ రీమేక్ చేసి ఘన విజయం సాధించడం విశేషం.ఇదిలావుండగా ఇటీవల సరైన సక్సెస్‌ లేని వెంకటేష్‌ మంచి హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: