ఆ దర్శకుడితో అనుష్క పెళ్లి..ముహుర్తం ఎప్పుడంటే ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆనతి కాలంలోనే ఎన్నో సినిమాల్లో నటించి ప్రతి ఒక్క ప్రేక్షకులను అలరించింది. తన నటన, అందంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. తాను నటించిన అరుంధతి సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

తర్వాత సైజ్ జీరో, వేదం వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడంతో ప్రేక్షకులు ఈ బ్యూటీని చూడలేకపోయారు. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క గత సంవత్సరం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో మంచి టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం అనుష్క వయసు 42 సంవత్సరాలు. వయసు పెరిగినప్పటికీ ఈ అమ్మడు క్రేజ్, అందం ఏమాత్రం తగ్గడం లేదు.

తనతో పాటు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ వివాహం చేసుకొని పిల్లలను కూడా కనేశారు. కానీ అనుష్క మాత్రం ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. పెళ్లి మాట కూడా ఎత్తడం లేదు. ఈ బ్యూటీకి ఎంతోమంది హీరోలతో, నిర్మాతలతో ఎఫైర్లు ఉన్నాయని కొన్ని రకాల రూమర్స్ వచ్చినప్పటికీ అవేవీ నిజం కాలేదు. తాజాగా అనుష్క ఓ దర్శకుడిని వివాహం చేసుకునేందుకు రెడీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఆ దర్శకుడు మరెవరో కాదు కోవెలమూడి ప్రకాష్ అని సమాచారం. దర్శకుడు కే. రాఘవేంద్రరావు తనయుడు. గతంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే విషయం బయటకు వస్తుంది. మరి వీరి వివాహం జరుగుతుందా లేదా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: