సమంతకు చిరాకు తెప్పించిన చైతు..కట్ చేస్తే అలా చేసి షాకిచ్చిన సమంత.!

FARMANULLA SHAIK
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక 'ఏమాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం 'సిటాడెల్: హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది. నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మిక్సడ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే  ప్రస్తుతం సమంత, నాగచైతన్యకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.హీరోయిన్ సమంత - నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలాకాలం వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం కొనసాగించారు. 

ఇక సామ్- చై ప్రేమించుకునే టైంలో చాలా సరదా సరదాగా గొడవలు చేసుకునేవారట. అఫ్ కోర్స్ అందరూ లవర్స్ అలానే గొడవలు పడుతూ ఉంటారు అనుకోండి.అలా నాగచైతన్య ఓ సినిమా షూట్ లో ఉన్న టైంలో సమంత పదే పదే ఫోన్ చేస్తూ విసిగించడంతో.. సమంత నెంబర్‌ను నాగచైతన్య బ్లాక్ చేసేసాడట.తర్వాత ఫోన్ చేసిన సమంతకు చైతు తన నెంబర్ బ్లాక్ చేశాడని తెలియడంతో.. నేరుగా షూటింగ్ స్పాట్‌కే వచ్చి తానే కార్లో కూర్చుని షూటింగ్ నుంచి నాగచైతన్యను తన కార్‌ దగ్గరకు రప్పించుకుందట. ఇక సమంతపై కోపాన్ని నాగచైతన్య కూడా మర్చిపోయి సారీ చెప్పి మళ్ళీ నెంబర్ అన్ బ్లాక్ చేశాడట. ఈ వార్తలో వాస్తవం తెలియదు కానీ తెగ వైరల్గా మారుతుంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం తన సెకండ్ మ్యారేజ్‌కు కూడా సిద్ధమయ్యాడు. శోభిత దూళిపాళ్లతో.. నాగచైతన్య ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకునే సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: