ఆ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా.. ఇప్పట్లో కష్టమేనట?

praveen
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. తన సినిమాలతోనే కాదు తన వ్యక్తిత్వంతో కూడా కోట్లాదిమంది అభిమానులకు గుండెల్లో చోటు సంపాదించుకోగలిగాడు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా సక్సెస్ఫుల్ హీరోగా కూడా కెరియర్ ని కొనసాగిస్తున్నారు. ఇక ఒక వైపు సినిమాలన్నీ మరోవైపు పాలిటిక్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఇక ఇప్పటికే సైన్ చేసిన సినిమాలను చేసే బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు. కాగా ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎవరితో సినిమాలు తీస్తున్నాడు అనే విషయంపై అందరికీ ఒక క్లారిటీ ఉంది. కాగా ఇక సురేందర్ రెడ్డి తో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో ఒక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి అప్పుడెప్పుడో ప్రకటన వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమా ఊసే లేదు.

 అసలు సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఉందా లేదా అనే విషయంపై అందరిలో అనుమానాలు నెలకొన్నాయ్. ఈ విషయంపై ఇటీవల నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేయాల్సిన సినిమా ఇప్పట్లో ఉండదు అంటూ నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు. స్క్రిప్ట్ రెడీగా ఉందని.. పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లోనే ఓకే చేశారని వెల్లడించారు. రేసుగుర్రం కిక్ సినిమాల్లో లాగానే కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాము అంటూ ఆ నిర్మాత చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం హీరో బిజీగా ఉండడంతో ఇక ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవు అంటూ తెలిపాడు. ఇక ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా తీస్తాం అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత రామ్ తాళ్లూరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: