విలన్గా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన రామిరెడ్డి.. చివరి రోజుల్లో అంత నరకమా. ?
తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్లకు విలన్లకు కొదవలేదని కూడా చెప్పవచ్చు. తెలుగులో విలన్ అంటే గతంలో ఎక్కువగా చాలామంది భయపడే సన్నివేశాలను చిత్రీకరించేవారు. ఆ క్యారెక్టర్లలో వారు లీనమై నటించడం వల్ల .. బయట కూడా వీరికి చెడ్డ పేరు వినిపించడమే కాకుండా చాలామంది దాడులకు గురయ్యారు. అలా తెలుగు ప్రేక్షకులను తన విలన్ నిజంతో భయపెట్టిన రామిరెడ్డి కూడా ఒకరు తన నటనతో చెరగని ముద్ర వేసుకున్న ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ 1990 ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయో నటనతో మైమరిపించారు.
అమ్మోరు, అంకుశం వంటి చిత్రాలలో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్న రామిరెడ్డి. అలాంటి నటన మళ్లీ ఏ నటుడు కూడా చూపించలేకపోయారట. ఈయనకు సినిమాల పరంగా భారీ డిమాండ్ ఉండేదని ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో విలన్ గా నటించిన రామిరెడ్డి తెలుగు, తమిళ్, కన్నడ, భోజపురి వంటి చిత్రాలలో కూడా నటించారట. అంతల ప్రభావితం చేసిన రామిరెడ్డి సుమారుగా 300 చిత్రాలకు పైగా నటించారు. అయితే ఆయన 55 ఏళ్లకే మరణించడం జరిగిందట. అందుకు కారణం ఆయన అనారోగ్య సమస్య వల్లే అన్నట్లుగా సమాచారం కాలేయ సమస్యతో ఇబ్బంది పడ్డ రామిరెడ్డి చివరి రోజుల్లో చాలా నరకాన్ని చూశాడట. ఈ జబ్బు వల్ల గుర్తుపట్టలేనంతగా మారిపోవడమే కాకుండా ట్రీట్మెంట్ కోసం దాచుకున్న డబ్బులు అన్ని కూడా అయిపోయాయని దీనివల్ల ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 2011 ఏప్రిల్ 14న కన్నుమూశారట.